క్రైమ్/లీగల్

రాడార్ పరికరాల పేరిట దగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 9: రాడార్ ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా చేస్తానని రష్యన్ ఎంబసీని 42500 యూఎస్ డాలర్లు మోసానికి పాల్పడిన నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు మోసం చేసిన మొత్తని వసూలు చేసి తిరిగి రష్యాకు అందించినందుకు ఆ దేశ ప్రతినిధులు.. రాచకొండ పోలీసులను అభినందించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మోసానికి సంబంధించిన వివరాలను కమిషనర్ వెల్లడించారు. దిల్లీలోని రష్యన్ ఎంబసి కార్యాలయం 2016 మేలో ఎలక్ట్రానిక్ రాడార్ పరికరాలు కావాలని టెండర్లు పిలిచారు. కాంట్రాక్టు దక్కించుకోవడానికి సరూర్‌నగర్‌లోని కేబీఆర్ గియో సర్వీసెస్ సంస్థతో పాటు పలువురు టెండర్ వేశారు. గుంటూరు జిల్లా మర్కపురానికి చెందిన కే.రంగబాబు.. కేబీఆర్ గియో సర్వీసెస్‌ని సరూర్ నగర్ హుడా కాలనీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారు. కాంట్రాక్ట్ గియో సంస్థకు రావడంతో మిషనరీ కోసం అడ్వాన్స్‌గా రష్యన్ ప్రభుత్వం నుంచి 42500 యుఎస్ డాలర్లు (21 లక్షల రూపాయలు) తీసుకున్నాడు. సంస్థ యజమాని ఆరు నెలల తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో, మోసపోయామని గ్రహించిన రష్యా ఎంబసి సెక్రటరీ వైస్ కౌన్సిల్ ఇగోర్ బోల్డ్‌య్రెవ్.. తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. సంస్థ కార్యాలయం రాచకొం డ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్‌లో ఉండడంతో కమిషనర్‌ని పిలిచి దేశ గౌరవానికి సంసబంధించిన విషయమని జాగ్రత్తగా కేసు దర్యాప్తు చేయాలని ఆదేశించారు. పోలీసులు గాలిస్తున్నారని తెలుసుకుని గుంటూరులోని మారుముల ప్రదేశంలో తలదాచుకుంటున్న రం గబాబుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేందకు అంగీకరించాడు. 42500 యుఎస్ డాలర్లను తిరిగి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. మోసం చేసి కాజేసిన డబ్బును తిరిగి అప్పగించినందుకు రష్యా ప్రభుత్వం.. తెలంగాణలోని రాచకొండ పోలీసులను అభినందించింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను రష్యా ప్రభుత్వ సెక్రటరీ కౌన్సిల్ ఇగోర్ బోల్డ్‌య్రెవ్.. ఎల్‌బీనగర్ డీసీపీ వెంకటేశ్వర్ రావు, ఏసీపీ వేణుగోపాల్ రావు, ఎల్‌బీనగర్ సీఐ భిక్షంరెడ్డి, నాచారం సీఐ రంగస్వామి ఎస్‌ఐ, జయరాం, కానిస్టేబుల్ కుమార్‌ని అభినందించారు.