క్రైమ్/లీగల్

హోమ్ గార్డు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 17 : అప్పుల బాధ తాళలేక హోమ్ గార్డు అత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం చిత్తూరు రూరల్ మండలం జంబుగోళం గ్రామంలో చోటుచేసుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు రూరల్ మండలం జంబుగోళం గ్రామానికి చెందిన లోకనాథరెడ్డి (26) చిత్తూరు ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌లో హోమ్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ పోషణ, తదితర కారణాల వల్ల శక్తికి మించి అప్పులు చేశాడు. ఇటీవల అప్పులు ఇచ్చిన వారి వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక లోకనాథరెడ్డి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. దీన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిత్తూరు తాలుకా పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.