క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, డిసెంబర్ 17: అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాళ్లబూదుగూరు ఎస్సై వెంకటేశ్వర్లు కథనం మేరకు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్‌రావు కుమారుడు హరికి, ఎస్.గొల్లపల్లి గ్రామానికి చెందిన బూసెపరావు కుమార్తె కాంతమ్మ(27)ను ఇచ్చి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు మగ సంతానం కలిగారు. అయితే గత కొంత కాలంగా అత్త నీలమ్మ, భర్త హరిల వేధింపులు ఎక్కువయ్యాయని పుట్టింటి వారితో మొరపెట్టుకున్నట్లు తెలిపారు. ఆదివారం సాయంత్రం భర్త మద్యం సేవించి ఇంట్లో పెద్దఎత్తున గొడవ చేసినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి అనుమానాస్పదంగా కాంతమ్మ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. రాళ్లబూదుగూరు ఎస్సై వెంకటేశ్వర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.