క్రైమ్/లీగల్

ఈచర్ వాహనం, లారీ ఢీకొని ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, డిసెంబర్ 17: హైదరాబాదు నుండి కోయంబత్తూరుకు రేకుల లోడ్‌తో వెళ్తున్న లారీ, తవణంపల్లి నుండి తిరుపతికి బ్రాయిలర్ కోళ్ల లోడుతో వస్తున్న ఈచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలు అయిన సంఘటన సోమవారం తెల్లవారుజామున మండలంలోని అగరాల వద్ద జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదు నుండి రేకుల లోడుతో కోయంబత్తూరుకు వెళ్తున్న ఓ లారీ, తవణంపల్లి నుండి తిరుపతికి బ్రాయిలర్ కోళ్లతో వస్తున్న ఈచర్ వాహనాలు వస్తుండగా సోమవారం తెల్లవారుజామున చంద్రగిరి మండలం అగరాల వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఈచర్ వ్యాన్‌లో కోళ్లు లోడింగ్ చేసే కార్మికులు తిరుపతి రూరల్ మండలం సత్తారుబైలుకు చెందిన మధు, రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్ కమ్మపల్లి అరుంధతీ వాడకు చెందిన వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందారు. ఇరు వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లు కలకడకు చెందిన శివ, తమిళనాడుకు చెందిన గోవిందులు, రామచంద్రాపురం మండలం రామానాయుడు కండ్రిగకు చెందిన కోళ్ల లోడింగ్ కార్మికుడు రవి తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలముందు భాగాలు నుజ్జునుజ్జు కావడంతో వాహనాల్లో మృతదేహాలు, డ్రైవర్లు ఇరుక్కు పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సాయంతో గంటపాటు తీవ్రంగా శ్రమించి ఇద్దరు డ్రైవర్లను బయటకు తీశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108వాహనంలో తిరుపతి రుయాసుపత్రికి తరలించారు. ఈ మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రాక్టర్ - ఆటో ఢీ, పది మందికి గాయాలు
* తృటిలో తప్పిన పెనుప్రమాదం
మడకశిర, డిసెంబర్ 17: మడకశిర పట్టణంలోని ఆదిరెడ్డిపాళ్యంలో ట్రాక్టర్, ఆటో ఢీకొన్న సంఘటనలో 10 మంది గాయాలకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మెళవాయికి చెందిన మహిళలు మాదేవి, నందిని, గాయిత్రి, పుట్టమ్మ, రాధ, నరసమ్మ, సంతోషమ్మ, మహాదేవమ్మ, ఈశ్వరమ్మ, రంగమ్మలు ఆటోలో పరిగి మండల కేంద్రంలో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీకి సోమవారం బయలుదేరారు. అయితే ఆదిరెడ్డిపాళ్యంలో ట్రాక్టర్ ఉన్నపళంగా రోడ్డుపైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో ఆటోలో ఉన్న మహిళలకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ నెమ్మదిగా వచ్చి ఢీకొనడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు బాబాబుడేన్ తెలిపారు.
గొర్రెల కాపరిపై చిరుత దాడి
కంబదూరు, డిసెంబర్ 17: మండల పరిధిలోని గూళ్లం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి కురుబ పాతన్నపై సోమవారం చిరుత దాడి చేసి గాయపర్చిన సంఘటన వెలుగు చూసింది. బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు గొర్రెల మందను తీసుకుని మేతకు వెళ్లడంతో పొదల చాటున దాగి ఉన్న చిరుత గొర్రెల మందపై దాడికి రావడంతో గమనించిన కాపరి చిరుతను తరమడానికి వెళ్లడంతో అది అతనిపై దాడి చేసి ఎడమ కాలి తొడను తీవ్రంగా గాయపర్చింది. గాయపడిన పాతన్నను మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు చికిత్స పొందుతున్న పాతన్న నుండి దాడి వివరాలను సేకరించారు.

ఈర ముద్దమ్మ దేవాలయంలో చోరీ
రొళ్ళ, డిసెంబర్ 17: రొళ్ళలో వెలసిన ఈర ముద్దమ్మ దేవాలయంలో ఆదివారం రాత్రి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదు దొంగలించుకెళ్ళినట్లు అర్చకులు మహేష్ తెలిపారు. దేవాలయంలో అమర్చిన హుండీని గుర్తుతెలియని వ్యక్తులు పెకిలించి అందులో ఉన్న రూ.10 వేలకు పైగా నగదు దోచుకెళ్ళినట్లు చెప్పారు. సోమవారం ఉదయం పూజలు నిర్వహించేందుకు వెళ్ళగా అప్పటికే దేవాలయ తలుపులు తెరచి ఉండటాన్ని గమనించారు.