క్రైమ్/లీగల్

ఘరానా దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) డిసెంబర్ 17: చెడు అలవాట్లుకు బానిసలయ్యారు... పేకాట, మద్యం మత్తులో పడి దొంగతనాలు వృత్తిగా ఎంచుకున్నారు. జిల్లాతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఖరీదైన మోటారు వాహనాలు చోరీ అమ్ముతున్న ఘరానా దొంగల ముఠా గుట్టును రట్టుచేశారు గుంటూరు అర్బన్ సిసియస్ పోలీసులు. సోమవారం సిసియస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిసియస్ అడిషనల్ ఎస్పీ శ్రీరాఘవ నిందితులను వివరాలను వెల్లడించారు. గుంటూరు కొరిటెపాడుకు చెందిన ముత్తుకూరి సాయిరామ్, గుంటూరు రూరల్ దాసరిపాలెంకు చెందిన లంజిపల్లి చడ్రక్, రాజీవ్‌గృహ కల్పకు చెందిన షేక్ అల్లాబక్షు ముగ్గురు ముఠాగా ఏర్పడి నగరంలో విలువైన మోటారు వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారు. నల్లపాడులో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని అరెస్టుచేసి వారి నుండి 5 లక్షల రూపాయల విలువైన 6 మోటారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిసియస్ అదనపు ఎస్పీ శ్రీ రాఘవ తెలిపారు. ఈ సమావేశంలో నల్లపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలమురళికృష్ణ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.