క్రైమ్/లీగల్

నగల కోసం మహిళను హతమార్చిన వ్యక్తికి జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), డిసెంబర్ 17: అభరణాల కోసం మహిళను హతమార్చిన కేసులో ఓ యువకుడికి జీవితఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు మహిళా నేరాల ప్రత్యేక న్యాయస్థానం, ఐదవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎల్ శ్రీ్ధర్ సోమవారం తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... జిల్లాలోని వినుకొండకు చెందిన కొప్పురావూరి శ్రీనివాసరావు భార్య లక్ష్మీకుమారి (45) పచ్చళ్లు, ప్లాస్టిక్ గ్లాసుల వ్యాపారం చేస్తుండేవారు. మాచర్ల మండలం జమ్మలమడక గ్రామానికి చెందిన మోర్ల రామాంజనేయులు వినుకొండలో నివాసం ఉంటూ ఒక కిరాణా దుకాణంలో గుమస్తాగా పనిచేసేవాడు. ఆ దుకాణానికి అవసరమైన గ్లాసులు సరఫరా లక్ష్మీకుమారి చేస్తుండేది. ఈ పరిచయంలో ఆమె వద్ద బంగారు నగలను కాజేయాలని రామాంజనేయులు పథకం రూపొందించుకున్నాడు. లక్ష్మీకుమారి పెరల్స్ నుండి చెక్కులు తెచ్చుకునేందుకు విజయవాడ వెళ్తుండగా ఆమెకు మాయమాటలు చెప్పి 2011 అక్టోబర్ 14వ తేదీన ఆమెతో విజయవాడ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో గుంటూరులోని నల్లపాడు లయోలా స్కూలు ఎదురుగా గల పొదల్లోకి తీసుకెళ్లి వెంటతెచ్చుకున్న కత్తిని గొంతులోకి దించి హతమార్చాడు. అనంతరం ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. మరుసటి రోజు స్థానికులు నల్లపాడు విఆర్‌ఒ కొనకంచి రమణశ్రీకి తెలియపర్చడంతో నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నల్లపాడు సిఐ మోజెస్‌పాల్ చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో తొలుత ప్రాసిక్యూషన్స్ డిప్యూటీ డైరెక్టర్, రెండవ జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాతూరి మధుసూధనరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు. తదనంతర క్రమంలో మహిళా నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు కావడంతో ఆ కోర్టు ఏపీపీ వేమూరి శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. నిందితుడు మోర్ల రామాంజనేయులుపై నేరం రుజువుకావడంతో జీవితఖైదుతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శ్రీ్ధర్ తీర్పుచెప్పారు.