క్రైమ్/లీగల్

చెరువులో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 9: చెరువులో పడి ఓ బాలుడు మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ నెహ్రూనగర్‌లో నివసిస్తున్న సాయిపోగు భరత్ - చిట్టీల కుమారుడు యశ్వంత్ (6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటోతరగతి చదువుతున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు పనికి వెల్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడు ఇంటి పక్కన ఉన్న ప్రవీణ్‌తో కలిసి పక్కనే ఉన్న ఇందిరానగర్ చిన్న చెరువుకు వెళ్లారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి చనిపోయాడు. స్నేహితుడైన ప్రవీణ్ ఇంటికి వచ్చి చెప్పగా బాలుడి మేనమామ మధు వెళ్లి నీటిలోకి దిగి చూడగా అప్పటికే యశ్వంత్ మరణించినట్లు పోలీసులు పేర్కొన్నారు. జీవనోపాధి కోసం ముంబై నుంచి వచ్చిన దంపతులకు ఒకే బాలుడు ఉండగా, ఆకస్మిక మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.