క్రైమ్/లీగల్

వేర్వేరు సంఘటనల్లో ఐదుగురు పాత నేరస్థుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, డిసెంబర్ 17: తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్థులను అరెస్టుచేసి వారి వద్దనుండి 6 లక్షల 93 వేల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న సంఘటన మల్కాజిగిరి సిసిఎస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం నేరేడ్‌మెట్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో డీసీపీ ఉమామహేశ్వరశర్మ వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి చంద్రగిరి కాలనీలో నివసించే రాజుల వీర వంశీనాయుడు అలియాస్ సాండీ అలియాస్ చిన్నా(31) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. వికరాబాద్‌కు చెందిన బొడిగె శ్రీ్ధర్ అలియాస్ సురేందర్(28) కారు మెకానిక్. ఘట్‌కేసర్‌కు చెందిన శివరాత్రి ప్రభు(21) , వికరాబాద్‌కు చెందిన కావలి నర్సింహ (33)డీసీఎం డ్రైవర్- నలుగురు పాత నేరస్థులు. గతంలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చారు. గత నెల 19 వతేదిన ఘట్‌కేసర్ చౌదరిగూడ, ఓయుకాలనీలో ఓ ఇంట్లో ఇంటి తాళాలు విరగొట్టి దొంగతనం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిసిఎస్ పోలీసులు వారిని అరెస్టు చేసి బంగారు, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు.
దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్థుడిని అరెస్టు చేసి అతడి వద్ద నుండి 7 లక్షల 97 వేల రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ కథనం.. ప్రకారం... చర్లపల్లి భరత్‌నగర్ కాలనీలో నివసించే బొంత యాదగిరి అలియాస్ గిరి(36) కూలి పని చేస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లలో దొంగతనాలు చేసి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆదివారం దమ్మాయిగూడ చౌరస్తాలో అనుమానస్పదంగా తిరుగుతున్న అతడిని పట్టుకుని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. అతని వద్ద నుంచి 15 తులాల బంగారు, కిలోన్నర వెండి అభరణాలు, మూడు బైక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు.