క్రైమ్/లీగల్

భార్య హత్యకేసులో భర్తకు జీవితఖైదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 18: భార్య హత్యకేసులో భర్తకు జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం చిత్తూరు ఎనిమిదవ అదనపు న్యాయమూర్తి కరుణకుమార్ తీర్పు ఇచ్చారు. గంగాధర నెల్లూరు మండలం నల్లరాళ్లపల్లికి చెందిన రవిచంద్రకు చిత్తూరు నగరం సాయినగర్ కాలనీకి చెందిన చెన్నకేశవ కుమార్తె అనుతో సుమారు 15సంవత్సరాల కింద వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రవిచంద్ర తన కుటుంబంతో చిత్తూరు నగరంలో చిన్న దుకాణం పెట్టుకొని జీవనం సాగించేవాడు. ఈ నేపథ్యంలో భార్యభర్తల మధ్య గొడవలు ప్రారంభయయ్యాయి. దీనిని జీర్ణించుకోలేని అను తన పిల్లలను భర్తవద్ద వదిలి బెంగళూరులో ఉన్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. ఆ తరువాత రవిచంద్ర కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని భార్యకు సమాచారం ఇవ్వటంతో కుమార్తెను చూడడానికి అను 2013 మే నెల 30వ తేదీన బెంగళూరు నుంచి చిత్తూరులోని తన భర్త వద్దకు వచ్చింది. కానీ ఇరువురి మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ సందర్భంగా అగ్రహానికి లోనైన రవిచంద్ర కొడవలిలో భార్యను నరకి చంపాడు. అను తండ్రి చెన్నకేశవులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచారు. విచారణలో రవిచంద్ర భార్యను హత్య చేసినట్లు రుజువు కావడంతో న్యాయమూర్తి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చారు.