క్రైమ్/లీగల్

‘గీతం’ విద్యార్థి అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటన్‌చెరు, మార్చి 10: పటన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థ్థితిలో మృతి చెందాడు. కళాశాలలోని భవనం ఐదవ అంతస్తు పైనుండి పడి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న యువకుడు దుర్మరణం పాలయ్యాడు. భవనం పైనుండి ప్రమాదవశాత్తు పడినట్టు కొంతమంది పేర్కొంటుండగా తండ్రి మందలించడంలో భవనం ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు మరి కొందరు పేర్కొంటున్నారు. రుద్రారం గ్రామ శివారులలోని గీతం హైద్రాబాద్ క్యాంపస్‌లో పి.సూర్య ఫణిభూషణ్ అనే విద్యార్థి ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. గుంటూరు జిల్లాకు చెందిన అతను తల్లిదండ్రులతో కలిసి హైద్రాబాద్‌లోని నిజాపేటలో నివాసం ఉంటున్నాడు. ఈసీఈ విభాగంలో మూడవ సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న ఫణిభూషణ్ శనివారం కాలేజీకి వచ్చిన అతను ఉదయం కళాశాల భవనం ఐదవ అంతస్తు నుండి కింద పడిపోయాడు. కళాశాల యాజమాన్యం అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఫణిభూషణ్ మృతి చెందాడు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదవశాత్తు విద్యార్థి దుర్మరణం పాలవడంతో కళాశాలలో జరుగుతున్న వార్షికోత్సవ కార్యక్రమాలను యాజమాన్యం రద్దు చేసింది. కాగా, సూర్య ఫణిభూషణ్‌ను అతని తండ్రి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పపడినట్టు ప్రచారం జరుగుతోంది. పరీక్ష ఫలితాలలో మార్కులు తక్కువ రావడంతో తండ్రి రమేష్ తీవ్రంగా మందలించాడని సమాచారం. దీనితో మనస్థాపానికి గురైన అతను భవనంపైకి ఎక్కి కిందకు దూకేసినట్టు తెలిసింది.

చిత్రం..సూర్య ఫణిభూషణ్