క్రైమ్/లీగల్

125 మంది మద్యం చోదకులకు జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ఈ నెల 5 నుంచి 9 వరకు నగర ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై 630 చార్జిషీట్లను కోర్టులో దాఖలు చేశారు. వీరిలో 125 మందికి జైలు శిక్ష విధించగా, 33 మంది డ్రైవింగ్ లైసెన్సులను కోర్టు శాశ్వతంగా రద్దు చేసింది. ఇందుకు సంబంధించి నగర ట్రాఫిక్ జాయింట్ సిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శిక్ష పడిన వారిలో ఒకరికి 15 రోజులు, ఒకరికి 6, ముగ్గురికి 6, 10 మందికి 5, ఆరుగురికి నాలుగు రోజులు, 34 మందికి 3 రోజులు, 70 మందికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష పడిందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై జరిమాన రూపంలో రూ.11,80,600 విధించినట్లు తెలిపారు.