క్రైమ్/లీగల్

లారీడ్రైవర్‌కు రెండేళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, డిసెంబర్ 19: నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమైన లారీడ్రైవర్ ఎస్‌కె రియాజ్ బాబుకు రెండేళ్లు జైలుశిక్ష, రూ. 11వేలు జరిమానాను విధిస్తూ అడిషనల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్‌క్లాస్ కోర్టు జడ్జి ఎన్ లావణ్య బుధవారం తీర్పు ఇచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నాయుడుపేటకు చెందిన రామాబత్తిన వెంకటేశ్వర్లు ఓజిలి మండలంలో వీఆర్వోగా పనిచేసేవారు. విధి నిర్వహణలో భాగంగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పనులు ముగించుకుని స్నేహితుడు జ్ఞానసాగర్‌తో కలిసి మోటారుసైకిల్‌పై ఓజిలికి వెళుతున్నారు. ఈక్రమంలో పోటుపాళెం సర్కిల్ వద్దకు వచ్చేసరికే నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళుతున్న లారీ అధిక వేగంతో వచ్చి మోటారుసైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వీఆర్వో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందగా జ్ఞానశేఖర్‌కు గాయాలయ్యాయి. ఈ మేరకు గూడూరు రూరల్ పోలీసులు 2013 డిసెంబర్ 26న కేసు నమోదు చేసి నిందితుడ్ని అప్పట్లో కోర్టుకు హాజరుపరిచారు. వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో జడ్జి నిందితునికి రెండేళ్లు జైలుశిక్ష, రూ. 11వేల జరిమానా విధించారు. ఈ కేసును ఏపీపీ సుకుమార్ వాదించారు.
దాడి కేసులో ఒకరికి ఏడాది జైలుశిక్ష
సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో ఓ మహిళపై ఓ వ్యక్తి పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని దాడి చేసి గాయపరిచిన కేసులో నేరం రుజువుకావడంతో ఆ వ్యక్తికి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎన్ లావణ్య సంవత్సరం జైలుశిక్ష రూ. 5వేలు జరిమానాను బుధవారం విధించారు. 2015 జూన్ నెలలో ఊటుకూరు గ్రామానికి చెందిన కుందకూరు సుబ్బమ్మ అనే మహిళపై అదే గ్రామానికి చెందిన పి ప్రసాద్ పాతకక్షలు మనసులో పెట్టుకుని దాడి చేయడంతో ఈ కేసులో సైదాపురం పోలీసులు నిందితుడిపై చార్జిషీటు వేసి కోర్టుకు పంపించారు. వాదోపవాదాలు జరిగి నిందితునిపై నేరం రుజువు కావడంతో జడ్జి సంవత్సరం జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధించారు. ఈ కేసును ఏపీపీ ఎస్ సుకుమార్ వాదించారు.