క్రైమ్/లీగల్

ప్రభుత్వాలను విమర్శించిన పాత్రికేయుడికి జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, డిసెంబర్ 19: కేంద్ర ప్రభుత్వాన్ని, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమంలో విమర్శించిన ఒక పాత్రికేయునికి ఒక సంవత్సరం కారాగార శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. ఇంఫాల్‌లోని వెస్టు డిస్ట్రిక్టు కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రీట్ ఈ నెల 14న ఈ శిక్ష విధించినట్టు పీటీఐ బుధవారం వెల్లడించింది. నేషనల్ సెక్యూరిటీ యాక్టు (ఎన్‌ఎస్‌ఎ) సలహాబోర్డు ఈనెల 11న సమావేశమై పాత్రికేయుడు కిషోర్‌చంద్‌పై వచ్చిన ఆరోపణలను పరిశీలించింది. జర్నలిస్టుపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నందున ఎన్‌ఎస్‌ఎ ప్రకారం అతడికి శిక్ష సబబేనని సమర్థిస్తూ 13న ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్ గవర్నర్ నజ్మాహెప్తుల్లా సైతం జర్నలిస్టుకు శిక్ష వేయాలని బోర్డు చేసిన సిఫార్సుకు ఆమోదముద్ర వేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రాణి జాన్సీలక్ష్మిబాయి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని బీజేపీ అధికారంలోని మణిపూర్ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం నిర్ణయించాయి. ఈ నిర్ణయాన్ని విమర్శిస్తూ స్థానిక టీవీ చానల్‌లో పనిచేసే జర్నలిస్టు కిషోర్‌చంద్ వాంగ్‌ఖేమ్ (39) కొన్ని వీడియోలను నవంబర్ 19న సామాజిక మాధ్యమంలోకి అప్‌లోడ్ చేశాడు. ఇంగ్లీష్, స్థానిక అధికార భాష మీతీల్లో ఉన్న ఆ వీడియో క్లిప్పింగ్‌లలో ఝాన్సీ లక్ష్మిబాయి జయంతి ఉత్సవాలు నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేసిందని, ఇది చాలా విచారకరమని, మణిపూర్‌కు కాని, రాష్ట్రానికి కాని ఝాన్సీ లక్ష్మిబాయి చేసిందేమీ లేకపోయినా రాష్ట్రప్రభుత్వం కేంద్రం నిర్ణయానికి తలొగ్గి జయంతిని నిర్వహించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ ‘కేంద్రం ఆడించే బొమ్మ, హిందుత్వ బొమ్మ’గా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా, కిషోర్ చంద్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. భారతదేశం ఐకమత్యంగా ఉండటానికి ఝాన్సీ లక్ష్మిబాయి తిరుగులేని పాత్ర పోషించారని, 1857లో జరిగిన సిఫాయిల తిరుగుబాటు ఉద్యయంలో ఆమె చూపిన తెగువను ఎవరూ మర్చిపోలేరని, అటువంటి వీరురాలికి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. కిషోర్‌చంద్ విమర్శలు చట్టాన్ని అతిక్రమించి ఉన్నందున ఆయనపై కేసు పెట్టినట్టు తెలిపింది. ఇలావుండగా తన భర్తపై పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని కిషోర్‌చంద్ భార్య రంజిత బుధవారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.