క్రైమ్/లీగల్

మరాఠా రిజర్వేషన్ల కోటా జనవరి 23 వరకూ అమలు చేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 19: మరాఠాలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ తాము మహారాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బిల్లు ప్రకారం రిజర్వేషన్ల కోటాను వచ్చే ఏడాది జనవరి 23వరకు ఉద్యోగ నియామకాల్లో అమలు చేయమని మహారాష్ట్ర ప్రభుత్వం బాంబే హైకోర్టుకు తెలియజేసింది. రిజర్వేషన్ల కోటాపై ప్రభుత్వం బిల్లు తేవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు కోర్టు వద్ద విచారణలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగాల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన ఇవ్వటాన్ని ఈనెలలో కోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం తరఫున విఏ తోరట్ బుధవారం చీఫ్ జస్టిస్ ఎన్‌హెచ్ పాటిల్, జస్టిస్ ఎంఎస్ కర్నిక్‌లతో కూడిన ధర్మాసనం ముందు మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 23 వరకు ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ నియామకాలు జరపదని స్పష్టం చేశారు. . శాసనసభలో ఆమోదం పొందిన కొత్త రిజర్వేషన్ల బిల్లు ప్రకారం ఎలాంటి నియామకాలు చేపట్టవద్దని తమ పరిధిలోని స్థానిక సంస్థలు, ప్రభుత్వ శాఖలు, ఇనిస్టిట్యూషన్స్‌కు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
మరాఠా కులస్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 16 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం బిల్లు తేగా దానిని వ్యతిరేకిస్తూ పలువురు పిటిషన్లు దాఖలు చేయగా, దానిని సమర్థిస్తూ మరికొందరు కేసు వేశారు. రిజర్వేషన్ల వ్యతిరేకుల తరఫున కేసును వాదిస్తున్న అడ్వకేట్ గుణరతన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి కోర్టులో కేసు జరుగుతుండగా ఉద్యోగాల నియామకానికి ప్రభుత్వం ప్రకటన ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల నియామకానికి ప్రకటన ఇచ్చిందని, దానిని వెంటనే నిలిపివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో బుధవారం ప్రభుత్వం తరఫున హాజరైన తోరట్ మాట్లాడుతూ ఉద్యోగ ప్రకటన వచ్చిన మాట వాస్తవమేనని, కాని ఉద్యోగ నియామక ప్రక్రియకు ఏడాదికి పైగా సమయం పడుతుందని, రాతపరీక్ష, ఇంటర్వ్యూలు తదితరాలు పూర్తయిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ల అంశాన్ని పరిశీలిస్తారని, రిజర్వేషన్ల కేసు ఫాస్టు ట్రాక్ ద్వారా పూర్తయితే రెండు మూడు నెలల్లో పూర్తవుతుందని ఆయన అఫిడవిట్ సమర్పించారు. రిజర్వేషన్ల అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మొత్తం నియామక ప్రక్రియను ఆపివేయమనడం సబబు కాదని, దీనివల్ల ఎంతో మంది నిరుద్యోగులకు నష్టం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన బొంబాయి హైకోర్టు కేసు తదుపరి విచారణ తేదీ జనవరి 23వరకు ఎలాంటి నియామకాలు చేపట్టమనిన్న మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అంగీకరిస్తూ దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై పూర్తి వివరాలతో అఫిడవిట్ తదుపరి విచారణ సమయానికి సమర్పించాలని ఆదేశించింది.