క్రైమ్/లీగల్

రిషబ్ చిట్స్ ఎండీ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తక్కువ పెట్టుబడులతో ఎక్కువ వడ్డీ చెల్లిస్తామని నమ్మబలికిన రిషబ్ చిట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ గుజ్జర్‌ను గురువారం హైదరాబాద్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రిషబ్ యాజమాన్యం గొలుసుకట్టు పథకంతో వందలాది మందితో పెట్టుబడులు పెట్టారు. ఈ పథకంతో దాదాపురూ. 200 కోట్ల రూపాయలు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. రిషబ్ చిట్టీలతో వచ్చిన సొమ్మును ఇతర వ్యాపారాలకు ఉపయోగించుకున్నారని ఖాతాదార్లు వాపోతున్నారు. కాగా బోయగూడలో నివాసం ఉన్న గుజ్జర్‌తో పాటు ఆయన భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజ్జర్ అరెస్టు విషయం తెలుసుకున్న ఖాతాదారులు అతడి నివాసానికి చేరుకుని ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌లోని రిషబ్ చిట్ట్ఫీండ్ కార్యాలయానికి తీసుకువచ్చారు. క్రైం పోలీసులు సుమారు 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు.