క్రైమ్/లీగల్

పాత నేరస్థుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చినా ప్రవర్తన మార్చుకోకుండా జంటనగరాల్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో పలు స్నాచింగ్‌లతో పాటు చోరీలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్థున్ని సౌత్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపి శ్రీనివాస రావు కేసు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర జలగాన్ ప్రాంతానికి చెందిన మీర్ అయాన్ అలిఖాన్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. దీంతో బందువుల ఇంట్లో కొంత కాలం ఉన్నాడు. అక్కడ వేదింపులు భరించలేక గ్రామాన్ని వదిలి ముంబాయికి పారిపోయాడు. రెండు రోజులు పాటు నిద్రాహారాలు లేకుండా తిరిగిన అనంతరం కొందరు గుర్తిం చి ఓ అనాధ శరణాలయంలో చేర్పించారు. అక్కడే ఆశ్రయం పొందుతూ మార్బుల్ పని నేర్చుకున్నాడు. ముంబాయిలోనే కొంత కాలం తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక్కడ మార్బుల్ పనిచేస్తూ జీవించసాగాడు. ఈ క్రమంలో అలిఖాన్‌కు ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేంద్రసింగ్ పరిచయం అయ్యాడు. అనుకున్నదే తడువుగా చోరీలను ప్రారంభించారు. ఈ క్రమంలో పలుమార్లు అరెస్టు అయిన అలి ఖాన్ సంవత్సరం పాటు పీడీ యాక్ట్‌కు గురి అయ్యాడు. అయితే తనకు ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడం, ఆర్థిక అవసరాలు పెరుగుతుండటంతో తిరిగి చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. వీరు హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చోరీలు చేయడంతో వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో సౌత్ జోన్ టాస్క్ఫోర్సు పోలీసులు ఇతన్ని అదుపులోనికి తీసుకొని విచారించగా చోరీల చిట్టా విప్పాడు. అతని వద్ద నుంచి 311 గ్రాముల ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలు, లక్షా, 25వేల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ కేసులతో సంబందం ఉండి పారారీలో ఉన్న హరీందర్ సింగ్, సయ్యద్ అహ్మద్‌ల గురించి పోలీసులు గాలిస్తున్నారు.