క్రైమ్/లీగల్

సిరిసిల్లలో కలకలం పేలిన జిలెటిన్‌స్టిక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, డిసెంబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిలెటిన్‌స్టిక్స్ పేలాయి. ఈ సంఘటనలో మహిళ గాయాలకు గురైంది. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌లో చెత్త కుప్పను కాల్చినపుడు ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో, చెత్త కుప్పల్లో జిలెటిన్‌స్టిక్స్ నిలువలు దాచి ఉంచగా, చెత్తను కాల్చే సమయంలో ఊహించని విధంగా పేలి, స్థానిక శాంతినగర్‌కు చెందిన బొద్దుల సత్తవ్వ(32) అనే మహిళ గాయాలకు గురైంది. ఖాళీ ప్రదేశంలో రోడ్డు పక్కన ప్రైవేటు స్థలంలో పెరిగిన మొక్కల మద్య ఉన్న చెత్తను సత్తవ్వ దగ్ధం చేసినపుడు ఒకే సారి జిలెటిన్‌స్టిక్స్ పేలడంతో ఆమె శరీరమంతా గ్లాస్ ముక్కలు గుచ్చుకున్నాయి. గాయాలకు గురైన ఆమె భయంతో ఇంటిలోకి పరుగెత్తింది. మతి స్థిమితం సరిగా లేని సత్తవ్వ ఏమి జరిగిందో తెలియక భయానికి లోనైంది. సంఘటన జరిగిన వెంటనే ప్రజలు పరుగెత్తుకుని రావడం, సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. సత్తవ్వను ఆసుపత్రికి తరలించి, సంఘటన స్థలంలో బాంబు స్క్వాడ్‌లతో సోదాలు నిర్వహించగా, చెట్ల పొదల మద్య వందకు పైగా జిలెటిన్‌స్టిక్స్ లభ్యమయ్యాయి. గుర్తు తెలియని వ్యక్తులు వీటిని చెట్ల పొదల మద్య దాచి ఉంచారని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాస్ తనిఖీలు నిర్వహించి, దర్యాప్తు జరిపారు. అయితే ఖాళీ స్థలం పక్కన ఇంటిలో గుట్టలను బాల్‌స్ట్ చేసే వడ్డెరలు అద్దెకు ఉండేవారని తెలిసింది. ఇటీవలే వారు ఇళ్ళు ఖాళీ చేసి పోవడంతో, ఈ జిలెటిన్‌స్టిక్స్ నిలువలను వారే దాచి ఉంచవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా చెత్త కుప్పల వద్ద ప్లాస్టిక్ గ్లాసులు, తదితర వస్తువులు ఏరుకుని సత్తవ్వ జీవిస్తుందని, ఆ కోవలోనే ఇటీవలే ఒక ఫంక్షన్‌లో వినియోగించిన ప్లాస్టిక్ గ్లాసులను ఏరుకోవడానికి వెళ్ళి, అక్కడ మంటలు పెట్టినపుడు ఈ సంఘటనకు దారి తీసినట్టు తెలిసింది. కాగా సత్తవ్వ సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.