క్రైమ్/లీగల్

మావో హరిభూషణ్ కొరియర్లు ముగ్గురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 22: మావోయిస్టు నేత హరిభూషణ్‌కు కొరియర్లుగా వ్యవహరిస్తూ ఆయుధ సరఫరాలో భాగం అవుతున్న ముగ్గురు కొరియర్లను శనివారం గంగారం సమీపంలో అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక తుపాకి, 20తుటాలను, విప్లవ సాహిత్యాన్ని స్వాదీనం చేసుకున్నారు. మహబూబాబాద్ టౌన్‌పోలీస్‌స్టేషన్‌సమావేశ హాల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఈ అరెస్ట్ వివరాలను వెల్లడించారు. గంగారం మండలం నర్సిగూడెం గ్రామానికి చెందిన ఈసం నాగేశ్వర్‌రావు ప్రజాప్రతిఘటనలో చేరి 2000 సంవత్సరం నుండి 2013వరకు దళసభ్యునిగా పనిచేసి పలు సందర్భాల్లో అరెస్ట్ అయి జైలు నుండి విడుదలై వచ్చాక తిరిగి పార్టీలోనే పనిచేస్తున్నాడు. అదేక్రమంలో గంగారం మండలం మడగూడ గ్రామానికి చెందిన నాగేశ్వర్‌రావు బందువు మావోయిస్టు నేత యాప నారాయణ అలియాస్ హరిభూషణ్‌తో పరిచయాలు ఏర్పడ్డాయి. 2013లో వీరి మద్య పరిచయం ఏర్పడి కోరియర్‌గా పనిచేస్తూ కొత్తవారిని పార్టీలోకి తీసుకొచ్చే పనులు చూసేలా నాగేశ్వర్‌రావుకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అప్పటి నుండి మావోయిస్టులకు సమాచారం చేరవేస్తూ నాగేశ్వర్‌రావు అనేకసార్లు గుండాల ప్రాంతంలో హరిభూషణ్‌ను కలిశారు. కొన్నిసార్లు హరిభూషణ్ మనషుల ద్వారా చత్తీస్‌ఘడ్ వెళ్లి కలిశారు. దాదాపు 5సంవత్సరాలుగా పార్టీ కోరియర్‌గా నాగేశ్వర్‌రావు పనిచేస్తున్నారు. ఇదేక్రమంలో గతంలో ప్రజాప్రతిఘటన దళంలో పనిచేసిన సమయంలో ఆయుధాల సరఫరా చేసి వ్యక్తుల వివరాలు తెలుసుకొని మావోయిస్టు పార్టీకి ఆయుదాలు సరఫరా చేయించాలని నాగేశ్వర్‌రావును హరిభూషణ్ కోరారు.దానికి అంగీకరించిన నాగేశ్వర్‌రావు మడగూడ గ్రామానికి చెందిన వీరబోయిన లింగస్వామి ద్వారా పందెం గ్రామానికి చెందిన జోగు రామయ్య వద్ద, పార్శిక వీరస్వామి, వేమునూరి అశోక్‌లతో కలసి ఒక రివాల్వర్, తొమ్మిది తూటాలను కొని వాటిని యాప నారాయణకు చేరవేయడానికి వెళ్తుండగా ఈ సంవత్సరం జనవరి నెలలో పై ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌చేసి జైలుకు పంపించడం జరిగింది. జైలు నుండి బయటకు వచ్చిన ఈసం నాగేశ్వర్‌రావు ప్రవర్తనలో మార్పు రాలేదు. మళ్లీ కారెపల్లి మండలం పెరుపెల్లి గ్రామానికి చెందిన వేంనూరి అశోక్, రాధాగోవింద్, నర్సంపేట మండలం ముత్తోజిపేటుకు చెందిన కేసరి శ్రీనివాస్‌ను కలుపుకొని మావోయిస్టు పార్టీ కోరియర్‌లుగా పనిచేస్తున్నారు. హరిభూషణ్‌తో సంబందాలు కొనసాగిస్తూనే యువతీ యువకులను మావోయిస్టు పార్టీలో చేర్చడానికై ప్రయత్నాలు చేశారు. ఆయుధాలు సరఫరా చేయాలని ఫొన్‌ద్వారా హరిభూషణ్ ఇటీవల నాగేశ్వర్‌రావుకు చెప్పాడు. నెలక్రితం హరిభూషణ్ వద్దకు చత్తీస్‌ఘడ్ వెళ్లి ఆయుధ కొనుగోలు కోసం రూ. లక్ష తీసుకొని నాగేశ్వర్‌రావు వచ్చాడు. ఆ డబ్బులు తీసుకొని నాగేశ్వర్‌రావు, అశోక్, రాధాగోవింద్‌లు హైదరాబాద్ వెళ్లి ఆయుధ డీలర్‌ను కలసి ఒక తుపాకి, 20తుటాలను కొనుగోలు చేశారు. అయుధ డీలర్ వద్ద తుపాకి కొన్న విషయాన్ని నాగేశ్వర్‌రావు హరిభూషణ్‌కు ఫొన్‌ద్వారా తెలిపారు.