క్రైమ్/లీగల్

లొంగిపోయిన నక్సలైట్లలకు రివార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: సీపీఐ మావోయిస్టు పార్టీ నేతలు కే.పురుషోత్తమ్ అలియాస్ అశోక్, ఆయన భార్య కే.వినోదిని అలియాస్ విజయలక్ష్మి శనివారం ఇక్కడ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ నేత పురుషోత్తం పార్టీలో ఎంకేగా పరిచితుడని చెప్పారు. పీపుల్స్‌వార్‌లో 1981లో చేరారని, ఆ తర్వాత ఇక్కడ టీచర్‌గా పనిచేస్తున్న వినోదినిని పెళ్లిచేసుకున్నారన్నారు. హైదరాబాద్ సిటీ కమిటీలో సభ్యుడిగా చేరి కార్యదర్శిగా పని చేశారన్నారు. నక్సలైట్ల ఉద్యమంలో చురుకుగా పనిచేసిన ఈ దంపతులు 60 మంది యువకులను నక్సలైట్లలో రిక్రూట్ చేసి శిక్షణ నిమిత్తం అడవులకు పంపించారన్నారు. అనంతరం పురుషోత్తం దంపతులను విశాఖపట్నంకు బదిలీపై పీపుల్స్‌వార్ నాయకత్వం పంపించిందన్నారు. 1991లో శాఖమూరి అప్పారావు, సమ్మిరెడ్డితో కలిసి పురుషోత్తం అరెస్టయ్యారన్నారు. ఆ నాటి యువజన కాంగ్రెస్ నేత పీ.సుధీర్ కుమార్‌ను నక్సలైట్లు కిడ్నాప్ చేశారని, వారి డిమాండ్లలో భాగంగా పురుషోత్తం జైలు నుంచి విడుదలయ్యారన్నారు. 1997 నుంచి 2000 వరకు పీపుల్స్‌వార్ ప్రచార కమిటీలో చురుకుగా పనిచేశారన్నారు. క్రాంతిపేరిట పార్టీ డాక్యుమెంట్‌ను రూపొందించి పంపిణీ చేశారన్నారు. 1996 నుంచి 2005 వరకు పార్టీ రాజకీయ విద్య కమిటీలో చురుకుగా పనిచేశారన్నారు. 2005 నుంచి 2014 వరకు పార్టీ ఆదేశంపై చెన్నైలో పురుషోత్తం దంపతులు ఉన్నారని పోలీసు కమిషనర్ చెప్పారు. పార్టీ సీనియర్ నేత అక్కిరాజు హరగోపాల్ ఆదేశాల మేరకు వీరు నడుచుకున్నారన్నారు. గత అక్టోబర్ 9వ తేదీన పోలీసుల ఎదుట లొంగిపోయిన పురుషోత్తం దంపతులు శనివారంనాడు విలేఖర్లతో మాట్లాడుతూ గత పదేళ్లుగా తాము అనేక సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, అందుకే లొంగిపోయామన్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కే స్వార్థపరుడని, ఆంధ్రా ఎమ్మెల్యేను ఇటీవల కాల్చి చంపిన కేసులో సూత్రధారి అని వారు చెప్పారు. గిరిజన ఎమ్మెల్యేలను చంపడం తప్పన్నారు. తాను, తన భర్త ఎటువంటి హింసాత్మక ఘటనల్లో పాల్గొనలేదని వినోదిని చెప్పారు. పార్టీలో తమ ప్రాధాన్యతను తగ్గించారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పురుషోత్తం తలపై రూ.8 లక్షలు, వినోదిని తలపై రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. ప్రస్తుతం ఎటువంటి ప్రతిఘటన లేకుండా నక్సలైట్ దంపతులు లొంగిపోయినందున వీరికి ఈ రివార్డును బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మొత్తం రూ. 13లక్షల చెక్‌ను వేరు వేరుగా కమిషనర్ అంజనీ కుమార్ అందజేశారు. వీరికి పునరావాస సదుపాయం ఏర్పాట్లు చేస్తామన్నారు. పురుషోత్తం, వినోదిని ఇరువురు సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన వారని పోలీసులు చెప్పారు. లొంగిపోయిన పురుషోత్తం, వినోదినిలకు రివార్డును అందజేయనున్నట్లు ప్రభుత్వం ఈనెల 11న జీవోను జారీ చేసింది. నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలీస్ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.