క్రైమ్/లీగల్

రేవ్ పార్టీపై దాడి పోలీసుల అదుపులో వైద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శామీర్‌పేట, డిసెంబర్ 22: రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే సమాచారంతో బాలానగర్ నగర్ ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసుల బృందం మండల కేంద్రంలోని సెలబ్రీటీ క్లబ్‌పై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శామీర్‌పేట మండల కేంద్రంలోని సెలబ్రీటీ క్లబ్‌లోని ఓ విల్లాలో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో తమ సిబ్బంది దాడులు నిర్వహించి ఏడుగురు విటులు, ముగ్గురు యువతులను, ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో గజ్వేల్ ప్రాంతంలో వైద్య వృత్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ఇద్దరు యువతులు ఆంధ్రప్రదేశ్, ఒక యువతి ముంబాయి, మరో యువతి హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతానికి చెందినవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ఏడుగురు వైద్యులు ఓదేం చంద్రారెడ్డి, నాగ మునె్నయ్య, మెరుగు సత్యనారాయణ, దొంతుల రాజ్‌కుమార్, కొలి చెలిమి మహిపాల్, నందికొండ శ్రీనివాస్, ఎ. లింగంతో పాటు ముగ్గురు యువతులు, ఈ రేవ్‌పార్టీకి మధ్యవర్తితత్వం వహిస్తున్న మహిళ మమతను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.