క్రైమ్/లీగల్

నకిలీ ఎరువుల తయారీ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: అక్రమంగా నకిలీ ఎరువులు, మందులు తయారు చేస్తున్న ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని రూ.15లక్షలు విలువైన సరకు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన తాడికొండ శ్రీనివాసరావు(45) గతంలో అగ్రికల్చర్ మ్యాట్రిక్స్, హైదరాబాద్ కెమికల్స్‌లో మార్కెటింగ్ శాఖలో పనిచేశాడు. ప్రస్తుతం విజయవాడ వచ్చి హైదరాబాద్ నుంచి ఎరువులను ఇక్కడకు తీసుకొచ్చి విజయవాడ పరిసర ప్రాంత షాపులకు విక్రయాలు జరిపాడు. మూడు సంవత్సరాల నుంచి నున్న ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తనకు మార్కెటింగ్ ద్వారా ఉన్న అనుభవంతో ప్రభుత్వం అనుమతి లేకుండా గుమస్తాగా కోడి శ్రీనివాస్ సహకారంతో అమృత్, మార్వెల్, త్రిసూల్, గ్రోబెస్ట్, సుప్రీం గోల్డ్, తీన్‌మార్, లియోజ్‌మీ, టెజ్‌మీ, డాలర్ అనే వివిధ రకాల పేర్లతో తయారు చేసిన రసాయన ఎరువులను, మందులను ప్యాకెట్లు, ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసి కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో, తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో విక్రయాలు సాగిస్తున్నాడు. ప్రస్తుతం నున్న నుంచి మకాం మార్చి భవానీపురం కబేళా ఇండ్రస్టీ ఏరియా, రామరాజ్యనగర్ నాలుగో లైనులో రెండు అంతస్తుల భవనం కింద పోర్షన్ అద్దెకు తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ ఏసీపీ రాజీవ్‌కుమార్, సీఐ సురేష్‌రెడ్డి బృందం నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో దాడులు నిర్వహించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని భవానీపురం పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి, ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

విద్యాసంస్థలు, ప్రభుత్వాఫీసులకు
ఫైబర్నెట్ కనెక్షన్లు
కలెక్టర్ లక్ష్మీకాంతం వెల్లడి
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించనున్నామని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన జిల్లాలో ఫైబర్‌నెట్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 66 వేల కుటుంబాలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కల్పించామని, మిగిలిన కుటుంబాలకు కూడా దశలవారీగా ఈ సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. ఈనెలకు 149 రూపాయలకే టీవీ కార్యక్రమాలు, టెలిఫోన్, ఇంటర్‌నెట్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. టీవీ ద్వారా 304 ఛానళ్లను వీక్షించే అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, పోలీస్టేషన్లు, ఎండిఓ కార్యాలయాలు, ఎమ్మెర్వో కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రులకు ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఎమ్మార్వో కార్యాలయం నుంచి ఫైబర్‌నెట్ కనెక్షన్ పొందవచ్చని ఇందుకు సంబంధించి సెటప్ బ్యాక్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సమావేశంలో జెసి విజయకృష్ణన్, సబ్‌కలెక్టర్ మీషా సింగ్, స్వప్‌నీల్ దినకర్, జెసి-2 పి బాబూరావు, విఎంసి కమిషనర్ జె నివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై
ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఫిర్యాదు
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్యలపై హల్‌ఛల్ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. ఆర్టీసి చైర్మన్ వర్ల రామయ్య స్వయంగా సీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో శృతి మించ ప్రత్యర్ధుల మీద, వారిని కించపరిచే రీతిలో కులాలను అగౌరవపరిచేవిధంగా రెండు వర్గాల మధ్య వైరుధ్యాలు పెంచే రీతిలో పోస్టింగ్‌లు పెడుతూ రాక్షసానందం పొందుతూ వారి మానసిక వికలత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నవంబర్ 11న ఉదయం 7:56 నిముషాలకు వర్ర రవీంద్రరెడ్డి అనే వ్యక్తి షెడ్యూల్డ్ కులానికి చెందిన నన్ను కించపరిచే రీతిలో ‘అవునురా మాదిగోడ వర్లిగా’ అని సంబోధిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడునుద్ధేశించి ‘ మీ కమ్మబాబును ఓడించడం కోసం మా రెడ్డి పార్టీ వైసీపీ పుట్టింది’ అని సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో కులాలను కించపరుస్తూ రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచే రీతిలో బెదిరిస్తూ రాయనలవి కాని బూతు మాటలతో పోస్టింగ్‌లు పెట్టడం జరిగింది. ఇది చూసిన నేను మానసిక క్షోభకు గురయ్యాను. ఈ దుశ్చర్యకు పాల్పడిన వర్ర రవీంద్రరెడ్డిపై చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య సీపికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సానుకూలంగా స్పందించిన సీపి పరిశీలించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మహిళా ప్రయాణికుల రక్షణకు
పైలెట్ ప్రాజెక్టుగా ‘అభయ్’
* కలెక్టర్ లక్ష్మీకాంతం
విజయవాడ (క్రైం), డిసెంబర్ 22: మహిళా ప్రయాణికుల రక్షణకు ‘అభయ్’ కార్యక్రమం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం అన్నారు. క్యాంపు కార్యాలయంలో శనివారం జిల్లా స్ధాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. విశాఖ జిల్లా మాదిరిగా ఇక్కడ కూడా అభయ్ తీసుకువస్తున్నామని, దీనిలో భాగంగా ఆటోలో డివైజ్‌లు ఏర్పాటు చేసి ఐఓటి పద్దతి ద్వారా మహిళా ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే గుర్తించే విధంగా సాంకేతికతను పోలీసు రవాణాశాఖకు అనుసంధానం చేశామని చెప్పారు. ఆటోడ్రైవర్ సీటు కింద ఏర్పాటు చేస ఈ డివైజ్ వల్ల మహిళా ప్రయాణీకులను ఆటోడ్రైవర్లు తప్పుదోవ పట్టించినా, మహిళా ప్రయాణీకులు వెళ్ళే ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలకు దారి మళ్లించినా ఇ-డివైజ్ ద్వారా రవాణా, పోలీసుశాఖకు సమాచారం అందుతుందన్నారు. మొదటి దశగా 50 ఆటోలకు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విజయకృష్ణన్, విఎంసి కమిషనర్ జె నివాస్, సబ్ కలెక్టర్లు మిషాసింగ్, స్వప్నిల్ దినకర్, జేసీ-2 బాబూరావు, డీసీపీ ట్రాఫిక్ శంకర్‌రెడ్డి, ఏసీపీ నాగరాజు, డీటీసీ మీరా ప్రసాద్, డిఎంహెచ్‌ఓ డాక్టర్ రమేష్, డిఇఓ రాజ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.