క్రైమ్/లీగల్

తుపాకీ చూపి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 11: రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టి..నాటు తుపాకీ చూపించి..దారి దోపిడీకి పాల్పడిన సంఘటన శనివారం రాత్రి 10:30సమయంలో కొత్తూరు మండలం గూడూరు గ్రామ పంచాయతీ సమీపంలో చోటు చేసుకుంది. ఆదివారం షాద్‌నగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ మాట్లాడుతూ మద్ధూరు గ్రామ పంచాయతీ బిక్యాతండాకు చెందిన దశరథ్ అనే యువకుడు కొత్తూరులో ఆన్‌లైన్ మనీట్రాన్స్‌ఫర్ వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగా శనివారం రాత్రి కొత్తూరులో షాప్ బంద్ చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాగ్యాతండా, లోక్యాతండాల సమీపంలో రహదారికి అడ్డంగా రాళ్లు పెట్టి నాటు తుపాకీ చూపించి దశరథ్ వద్ద ఉన్న డబ్బుల బ్యాగును తీసుకునేందుకు దొంగలు ప్రయత్నించగా ఎంతకు దశరథ్ ఇవ్వకపోవడంతో నాటు తుపాకీ తీసి ఒక రౌండ్ కాల్పులు జరిపి డబ్బుల సంచి తీసుకొని పరారైనట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తిమ్మాపూర్ చెక్‌పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై నేనావత్ రమేష్, షేక్ ఇర్పాన్ అహ్మద్, అంగోతు రథన్ ముగ్గురు యువకులు వెళ్తుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి సున్నపు గంగారం కొత్తూరులో అనుమానస్పదంగా తిరుగుతుండగా పట్టుకొని విచారించగా అసలు విషయం బయటపడిందని వివరించారు. నిందితుల నుండి ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లు, ఒక నాటు తుపాకీ, ఎనిమిది బుల్లెట్లు, 78,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్, ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్, ఏఎస్‌ఐ రంగయ్య, సిబ్బందిని సైబరాబాద్ కమీషనర్ అభినందించినట్లు షాద్‌నగర్ ఏసీపీ సురేందర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు హరిప్రసాద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.