క్రైమ్/లీగల్

చోరీ కేసులో నలుగురికి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, డిసెంబర్ 25: ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన నలుగురిని చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఘట్‌కేసర్ క్రైం ఇన్‌స్పెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. పోలీసు స్టేషన్ పరిధి అవుషాపూర్‌లో ఈనెల 22న స్క్రాప్ వ్యాపారం చేసే బోగర్ల అంజయ్య తన బంధువుల ఇంటికి వెళ్లగా ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న ఎల్‌జీ కలర్ టీవీ, నాలుగు కీలోల కాఫర్ వైరు, ఒక్క వెండి ఉంగరాన్ని చోరీ చేసిన గుంజి వెంకన్న(37), ఐల రమేశ్(24), వేలాయుదం రాజా(27), యేటగిరి నర్సింహ(22) చోరీ చేసినట్లు తెలిపారు. దొంగిలించిన టీవీ, కాఫర్ వైర్, వెండి ఉంగరాన్ని గొనే సంచిలో పెట్టుకుని మంగళవారం ఉదయం ఉప్పల్‌లో అమ్మేందుకు వెళ్తూ ఘట్‌కేసర్ బస్టాండ్‌లో ఉండగా క్రైం టీం పోలీసులు గోనే సంచిని పరిశీలించగా దొంగతనం బయట పడినట్లు తెలిపారు. దొంగతనానికి పాల్పడిన నలుగురు దొంగలను అదుపులోకి తీసుకుని వస్తువులను స్వాదీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు డీఐ కిరణ్ కుమార్ తెలిపారు.