క్రైమ్/లీగల్

పాతబస్తీలో కాల్పుల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: పాతబస్తీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఫత్తేదర్వాజా ప్రాంతంలో భూ వివాదం కాల్పులకు దారి తీసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య మూడు అడుగుల స్థలం విషయమై గొడవ తలెత్తిన నేపథ్యంలో తాబిక్ మిన్ మహఫూజ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. గాల్లోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాల్పులు జరిపిన తాక్షా బినే్ద మహఫూజ్‌ను అదుపులోకి తీసుకున్న హుస్సేనీ ఆలం పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుల నుంచి పాయింట్ 0.32 తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.