క్రైమ్/లీగల్

గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 25: లకీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో సంతోష్‌నగర్‌కు చెందిన వ్యక్తులు సోమవారం రాత్రి విధ్వంసం సృష్టించారు. వైద్యుల నిర్లక్ష్యంతో రోగి మృతి చెందిందని ఆరోపిస్తూ పెద్దగా కేకలు వేస్తూ అద్దాలను పగుల గొట్టారు. అడ్డువచ్చిన సెక్యూరిటీ గార్డులను, సిబ్బందిపై విరుచుకుపడ్డారు. రెసెప్షెన్‌లో ఉన్న కంప్యూటర్లను, ప్రింటర్లను విసిరి పారేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్‌నగర్‌కు చెందిన షమీమ్ బేగం (45) శ్వాసకోశ సమస్యతో బాధపడుతుంది. ఆమెను కుటుంబ సభ్యులు ఈనెల 18న లక్డ్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆమెను పరీక్షించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు పూర్తి చేసిన అనంతరం చికిత్స ప్రారంభించారు. ఈనెల 24న పరిస్థితి విషమించడంతో ఆమెను వైద్యులు పరీక్షించి వెంటనే గుండెపోటుతో బాధపడుతున్నట్టు గుర్తించారు. దీంతో ఆమెను ప్రత్యేక వార్డుకు తరలించి సీపీఆర్ చేస్తుండగా అక్కడికి వచ్చిన కుమారుడు మొయినుద్దీన్ తన తల్లికి ఏదో జరిగిందని, వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మృతిచెందిందని బిగ్గరగా అరుస్తూ ఆసుపత్రిలో హంగామా సృష్టించాడు. ఇతనికి అనంతరం సోదరులైన బర్కత్ అలీ ఖాన్, ముస్త్ఫా అలీ ఖాన్, మొహిసిన్‌తో కలిసి ఆసుపత్రిలో బీభత్సం చేశారు. డయాలసిస్ నిర్వహించే వార్డుతో పాటు ఇతర వార్డుల అద్దాలను విక్షణారహితంగా పగులగొట్టారు. అనంతరం రిసెప్షన్‌లోని కంప్యూటర్లు, ప్రింటర్లను ధ్వంసం చేశారు. ఆ సమయంలో వారిని వారించేందుకు వచ్చిన సెక్యూరిటీ, సిబ్బందిని భయబ్రాంతులకు గురి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారితోనూ దురుసుగా ప్రవర్తించి దాడికి యత్నించారు. మరికొంత మంది పోలీసులను సంఘటన స్థలానికి రప్పించి ఆందోళనకారులను అరెస్టు చేయించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వైద్యులపై దాడి చేయడం, ఆసుపత్రులను ధ్వంసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాలను సైతం వీరిపై నమోదు చేస్తామని వివరించారు.