క్రైమ్/లీగల్

సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), డిసెంబర్ 25: కులాలను, మతాలను అగౌరవపరిచే రీతిలో సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీఎస్‌ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. కులాలను కించపరిచి, ఏపీ సీఎం చంద్రబాబుపై బురద జల్లే విధంగా పోస్టింగ్‌లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన మంగళవారం నగరంలోని కృష్ణలంక పోలీస్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వివిధ రకాలుగా ప్రత్యర్థుల మీద, వారిని కించపరిచే రీతిలో, కులాలను అగౌరవపరిచే రీతిలో పోస్టింగ్‌లు పెడుతూ రాక్షసానందం పొందుతూ వారి మానసిక చపలత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కులం పేరుతో మాట్లాడినట్లు ప్రచారం చేయడం విచారకరమన్నారు. కులాల మధ్య వైరుధ్యాలు పెంచే విధంగా ఆ పోస్టింగ్ ఉందన్నారు. ఈ పోస్టింగ్ ఒక ప్రముఖ ఛానల్ కూడా ప్రచారం జరిగినట్లుగా కూడా చిత్రీకరించినట్లు తెలిపారు. నిజానికి చంద్రబాబు అలా ఎక్కడా అనలేదన్నారు. ఇది కావాలని ఎవరో చంద్రబాబుపై కల్పించిన పుకారుగా తెలిపారు. దీనితో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా సీఎం చంద్రబాబు కూడా మానసికంగా బాధపడినట్లు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మరోసారి ఇటువంటి దుస్సాహసానికి పాల్పడకుండా వారిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన పోస్టింగ్ జిరాక్స్ కాపీలను జత చేసి ఫిర్యాదు పత్రం అందజేశారు.