క్రైమ్/లీగల్

పాతబస్తీలో యువకుడి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఇద్దరు యువకుల మథ్య జరిగిన స్వల్ప ఘర్షణ కత్తిపోట్లకు దారితీసి ఓ యువకుడిని స్నేహితులే దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇక్కడి ఖాజా పహాడీ నంజాన్ కాలనీ ప్రాంతంలో గుర్రపు దొడ్డి ఉంది. అక్కడ మహ్మద్ మోసిన్, మహ్మద్ అమీర్ తన స్నేహితులతో కలిసి సోమవారం రాత్రి మాట్లాడుకుంటూ ఉండగా వీరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో మహ్మద్ అమీర్ అనే వ్యక్తి మోసిన్‌పై కత్తితో దాడి ఎడమ తొడపై పొడిచాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే చికిత్స నిమిత్తం తీవ్ర గాయాల పాలైన మోసిన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. కాలాపత్తర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమీర్, మోసిన్‌తో పాటు అతని స్నేహితులు రెహ్మాన్, ఎస్సార్, గుడ్డు, అధ్నాన్ తదితరులున్నారు. పోలీసులు ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.