క్రైమ్/లీగల్

రైలు నుంచి జారిపడి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలాస, డిసెంబర్ 26: కాశీబుగ్గ ఎల్‌సి గేటు సమీపంలో పలాస రైల్వేస్టేషన్‌కు వెళ్లే మార్గంలో మందస మండలం, బొగాబంద గ్రామానికి చెందిన నర్శింహులు(30) అనే యువకుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జి ఆర్ పి ఎస్ ఐ రవికుమార్ తెలిపారు. జి ఆర్‌పి పోలీసుల కథనం మేరకు బొగాబందకు చెందిన దండాసి,వరలక్ష్మిలకు చెందిన పెద్దకుమారుడు నర్శింహులు గతంలో ఆటో నడిపేవాడు. ఆరునెలలు క్రితం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లి నెల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. మృతుడుకు మరో ఇద్దరు సోదరులున్నారు. నర్శింహులు వీసా పని మీద వైజాగ్‌కు వెళ్తానని బయలుదేరి రైలు నుంచి జారి పడ్డాడని తెలిపారు. విషయం తెలుసుకున్న తండ్రి, సోదరులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరుమున్నీరుగా విలపించడం పలువురు హృదయాన్ని కలచివేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.