క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలిజిపేట, డిసెంబర్ 26: మండలంలోని పెదపెంకి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాడంగి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన చప్ప శంకరరావు తుమరాడ గ్రామానికి బైక్‌పై వస్తుండగా బలిజిపేట నుంచి పెదపెంకి వైపు బైక్‌పై ఎదురుగా వస్తున్న కాగాన రమేష్, పెంకి అశోక్‌లు గీతామందిరం సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శంకరరావు, అశోక్, రమేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా శంకరరావు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వై సింహాచలం తెలిపారు.
మద్యం సీసాల ధ్వంసం
పాచిపెంట, డిసెంబర్ 26: మండలంలో 14 మద్యం కేసులకు సంబంధించి 263మంది సీసాలను పాచిపెంట పోలీస్‌స్టేషన్ వద్ద ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ విజయకుమార్ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సన్యాసినాయుడు, వీఆర్‌ఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.