క్రైమ్/లీగల్

మధిరలో ఒకే అపార్ట్‌మెంట్‌లో 3ప్లాట్లలో చోరీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, డిసెంబర్ 26: మధిర పట్టణంలోని సుందరయ్యనగర్‌లో ఒకే అపార్ట్‌మెంట్‌లో 3ప్లాట్లలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఏఆర్ అపార్ట్‌మెంట్‌లోని గింజుపల్లి పుల్లారావు, మాచవరపు చలపతిరావు, కొమ్మినేని విద్యాసాగర్‌లు ఉంటున్నారు. వీరు రెండురోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్ళారు. బుధవారం ఉదయం పక్క ప్లాట్లలోని వారు లేచి చూడగా వీరి ప్లాట్లయొక్క తాళాలు పగలగొట్టి తలుపులు తెరిచి ఉండటంతో చోరి జరిగిన విషయాన్ని గుర్తించి వారికి సమాచారం అందించడంతో పాటు పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి మధిర టౌన్ ఎస్‌ఐ వెళ్ళి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అయితే 3ప్లాట్లలో ఏమి చోరీకి గురయ్యాయో తెలిపేందుకు ఆ ప్లాట్ల వారు అందుబాటులో లేరు. అయితే తాము వచ్చిన తరువాత పరిశీలించి పోయిన వాటి వివరాలతో ఫిర్యాదు చేస్తామని పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించారు. అయితే చోరీకి గురైన ఒక ఫ్లాట్‌లో 4లక్షల బంగారం పోయినట్లు బాధితులు పోలీసులకు తెలిపినట్లు తెలిసింది. ఎవరైనా ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చివెళితే ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీని పెంచుతామని టౌన్ ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.