క్రైమ్/లీగల్

2జి-స్పెక్ట్రమ్ కేసు విచారణను ఆర్నెల్లలో ముగించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 12 : 2జి స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించిన విచారణను మరో ఆరునెలల్లోగా పూర్తి చేయాలని సుప్రీకోర్టు సోమవారం సిబీఐ, ఈడీ సంస్థలను ఆదేశించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం, కేసు విచారణ ఏ స్థాయిలో ఉన్నదీ రెండు వారాల్లోగా తమకు తెలియజేయాలని, కేంద్రాన్ని ఆదేశించింది. 2జి స్పెక్ట్రమ్, దానిని సంబంధించిన ఎయిర్‌సెల్-మాక్సిస్ డీల్‌లపై విచారణ బహుకాలంగా కొనసాగుతోందని, ఇంతటి సున్నితమైన అంశాన్ని ఇప్పటికీ దేశ ప్రజలకు తెలియపరచకుండా ఉంచటం సాధ్యం కాదని పేర్కొంది.
2జి స్పెక్ట్రమ్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్ గ్రోవర్‌ను సుప్రీంకోర్టు రిలీవ్ చేసింది. ఆయన 2014లో నియమితులయ్యారు. కాగా ఆయన స్థానంలో అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత్‌ను నియమిస్తూ కేంద్రం నిర్ణయానికి కోర్టు ఆమోదం తెలిపింది.