క్రైమ్/లీగల్

స్మగ్లర్లు, టాస్క్ఫోర్స్ సిబ్బంది మధ్య పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 28: చిత్తూరు జిల్లా తిరుపతి శివారు కరకంబాడి పై భాగాన ఉన్న శేషాచల కొండల్లో ఉన్న సీలు కోన వద్ద ఎర్రస్మగ్లర్లకు, టాస్క్ఫోర్స్ సిబ్బందికి మధ్య శుక్రవారం సాయంత్రం పోరు సాగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ సిబ్బందిపై పెద్ద సంఖ్యలో ఉన్న ఎర్రకూలీలు రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఓవైపు చిమ్మచీకటి, మరోవైపు ఎర్రకూలీలు విసురుతున్న రాళ్లదాడిని తప్పించుకొని వారిని పట్టుకోవడానికి టాస్క్ఫోర్స్ సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. దీంతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆత్మరక్షణ కోసం టాస్క్ఫోర్స్ సిబ్బంది గాలిలోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. నెట్‌వర్క్ సక్రమంగా లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించడానికి కూడా టాస్క్ఫోర్స్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. మెసేజ్‌ల ద్వారా అధికారులకు సమాచారం అందించడంతో అదనపు బలగాలను సీలుకోన వద్దకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఎర్రకూలీలు పట్టుబడ్డారా లేదా అన్నది పూర్తి సమాచారం అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా శుక్రవారం కరకంబాడి రోడ్డులోని హరిత కాలనీ వద్ద ఆర్‌ఎస్‌ఐ నరసింహులు బృందం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించింది. ఈసందర్భంగా అడవిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10మంది ఎర్రకూలీలు టాస్క్ఫోర్స్ రాకతో పలాయనం చిత్తగించారు. ఈ సమయంలో వారు వెంట తెచ్చుకున్న ఆహారపదార్థాలు, బియ్యం, కార్లు, తమిళనాడుకు చెందిన మద్యాన్ని వదలివెళ్లారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకున్నారు.