క్రైమ్/లీగల్

కళ్లు గీతకు వెళ్లి అనంతలోకాలకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, జనవరి 1: ఎప్పటిలాగే కళ్లు గీతకు చెట్టుకు ఎక్కిన గిరిజనుడు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన కుటుంబ సభ్యులకు శోకసముద్రంలోకి నెట్టింది. పోలీసులకు తెలిపిన వివరాలు మేరకు మండలంలోని మహాసింగి గ్రామానికి చెందిన సవర బారికి (40) అనే గిరిజనుడు మంగళవారం తెల్లవారుజామున ఈతకళ్లు దించేందుకు చెట్టు ఎక్కాడు. తన భర్త మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకోకపోవడంతో మృతుని భార్య చిన్నమ్మి గ్రామ సమీపంలో వెతికేసరికి చెట్టుపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురైనట్టు గుర్తించారు. వెంటనే బారికను కొత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సల కోసం తరలించగా, పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వైద్యులు శ్రీకాకుళం తరలించారు. జెమ్స్ ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మరణించాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ సంఘటనపై భార్య చిన్నమ్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏ ఎస్ ఐ మస్తాన్ తెలిపారు.