క్రైమ్/లీగల్

జూన్‌లోగా బార్ కౌన్సిళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్ర, తెలంగాణలకు విడివిడిగా బార్ కౌన్సిళ్లు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఉమ్మడి హైకోర్టును ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లోగా బార్ కౌన్సిళ్లను ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేస్తే అప్పటినుండీ రెండు వేర్వేలు బార్ కౌన్సిళ్లు అందుబాటులోకి వస్తాయని న్యాయమూర్తి చలమేశ్వర్, న్యాయమూర్తి సంజ య్ కిషన్ కౌల్‌తో కూడిన ధర్మాసనం ఆదేశం జారీ చేసింది. ఉమ్మడి హైకోర్టు సిబ్బందికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం. తన ఆదేశాలను తానే అమలు చేయకపోతే ఎలా అంటూ ఇరువురు న్యాయమూర్తులు ఉమ్మడి హైకోర్టును ప్రశ్నించారు. ఉమ్మడి హైకోర్టు తమ సిబ్బందికి సంబంధించి ఇచ్చిన ఆదేశాన్ని సుప్రీం కోర్టులో తానే చాలెంజ్ చేయటం గమనార్హం. హైకోర్టు తమ ఆదేశాలను అమలు చేయకపోతే ఎస్‌ఎల్‌పీని డిస్మిస్ చేస్తామని సుప్రీం కోర్టు హెచ్చరించింది.