క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ భార్య గొలుసు స్నాచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెహిదీపట్నం, జనవరి 8: రోజురోజుకు దొంగలు రెచ్చిపోతున్నారు. పశ్చి మ మండల పరిధిలోని జియాగూడలో రెండుచోట్ల దుకాణ సముదాయాల షట్టర్ల తాళాలు పగులగొట్టడం తో స్థానికులు ఆప్రమత్తత అవడంతో దొంగలు పారిపోయారు. ప్రధాన రహదారిలోనే ఈ రకంగా ఉంటే ఇక గల్లీలో, కాలనీల్లో ఎలా ఉంటుందో అని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళ్లితే... మంగళవారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో జియాగూడ ప్రధాన రహదారిలోని 2జె బస్సుస్టాపు వద్ద గల ఓ మెడికల్ హాల్ తాళంను గుర్తుతెలియని వ్యక్తి పగులగొట్టాడు. ఆదే ప్రాంతానికి చెందిన ఓ వ్యిక్తి శబ్దం వస్తుందని తొంగి చూడగా మెడికల్ హాల్ తాళాలను పగులగొడుతున్నాడు. వెంటనే పెద్దగా అరవడంతో ముసుగు ధరించిన దొంగ పారిపోయాడు. గత నాలుగు రోజుల క్రితం పూరానాపూల్ వద్ద కూడా ఓ షట్టర్ తాళాలు పగులగొడుతుండగా స్థానికులు చూడటం తో దొంగలు పారిపోయారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
చైన్ స్నాచింగ్
జియాగూడ లక్ష్మీనరసింహనగర్ ప్రాంతానికి చెందిన సంతోష్ స్పెషల్ ప్రొటెక్షన్ విభాగంలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సంతోష్ భార్య ఉమారాణి ప్రతిరోజు మాదిరిగానే సోమవారం ఉదయం చెత్త పడేసేందుకు పక్కకు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోంచి నాలుగు గ్రాముల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయాడు. బాధితురాలు లబోదిబోమన్నా ఎలాం టి ప్రయోజనం లేకపోయింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కుల్సుంపూరా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనాలు కాకుండా పోలీస్ పెట్రోలింగ్‌లను కూడా పెంచినట్లు కుల్సుంపూరా అదనపు ఇన్స్‌పెక్టర్ తిరుపతి తెలిపారు. త్వరలోనే దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.