క్రైమ్/లీగల్

రిటైర్డ్ పోలీస్ అధికారి జేబులోంచి సెల్‌ఫోన్ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 8: బస్టాప్‌లో ఓ వ్యక్తి జేబులోంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు రెంజ్‌కు చెందిన రిటైర్డ్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, అనంతపురం జిల్లా విద్యుత్‌నగర్‌కు చెందిన మహబుబ్ పీరా మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో హమయత్‌సాగర్ వైపు వెళ్లేందుకు లకిడీకపూల్ బస్టాప్‌లో నిలుచున్నాడు. మొబైల్‌ఫోన్‌ను సరూర్‌నగర్ మండలం నందనవనానికి చెందిన మేకల జగపతి అలియాస్ జగత్(24) కొట్టేసాడు. పారిపోతుండగా ఇంటర్‌సెప్టర్ వాహనంలో ఉన్న పోలీసులు గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. అతన్ని సైదాబాద్ పోలీసులకు కానిస్టేబుల్ ఎన్.కిషన్, హోంగార్డు జీ.నారాయణ రెడ్డి అప్పగించారు. జగత్ పాత నేరస్థుడు. హయత్‌నగర్, మీర్‌పేట్ పోలీస్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. కోఠీ, మెహిదీపట్నం, లంగర్‌హౌజ్, పటాన్‌చెరు, లింగంపల్లిలో చోరీలకు పాల్పడ్డాడు. నిందితుడుని పట్టుకున్న కానిస్టేబుల్ కిషన్, హోంగార్డు నారాయణ రెడ్డిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అభినందించి చెరో వెయ్యి రూపాయల నగదు అవార్డును అందజేశారు.