క్రైమ్/లీగల్

అలోక్‌వర్మే సీబీఐ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: కేంద్రం ఆదేశంపై సెలవుపై వెళ్లిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ పదవిలో మళ్లీ నియమిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం సంచలన తీర్పు ఇచ్చింది. కాని అలోక్‌వర్మ పరిపాలనాపరంగా ఎటువంటి అధికారాలను చలాయించేందుకు వీలు లేదని షరతును విధించింది.
సీబీఐ డైరెక్టర్‌ను నియమించేందుకు చట్టబద్ధంగా ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై అధికారాలను ఇవ్వడంపై నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి విధాన నిర్ణయాలను అలోక్‌వర్మ అమలు చేసేందుకు వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. అలోక్‌వర్మ రెండేళ్ల పదవీ కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఉన్నత స్థాయి కమిటీ తీర్పు వెలువడినప్పటి నుంచి వారం రోజుల లోపు సమావేశమై నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కేకౌల్, జస్టిస్ కేం జోసెఫ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. తనను బలవంతంగా సెలవుపై కేంద్రం పంపడాన్ని సవాలు చేస్తూ అలోక్‌వర్మ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన తర్వాత కోర్టు పై తీర్పును వెలువరించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అలోక్‌వర్మపై వచ్చిన ఆరోపణలను విచారిస్తున్నందు వల్ల అధికారాలను అలోక్‌వర్మ ఇవ్వడంపై ఉన్నత స్థాయి కమిటీ తీసుకుంటుందని కోర్టు పేర్కొంది. ఈ కమిటీలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్‌సభలో ప్రతిపక్షనాయకుడు సభ్యులుగా ఉంటారు. సీబీఐ డైరెక్టర్‌ను ఉన్నతస్థాయి కమిటీ నియమించినందు వల్ల కేంద్రం తనకు తానుగా సెలవుపై పంపడం, పదవి నుంచి తప్పించడం చేయడం సరికాదని, కమిటీ ద్వారానే అన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ కేసుపై కోర్టు తీర్పును సమతౌల్యంగా ఇచ్చింది. సీబీఐ డైరెక్టర్‌ను గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన రాత్రికి రాత్రి సెలవుపై కేంద్రం బలవంతంగా పంపిన విషయం విదితమే. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, జాయింట్ డైరెక్టర్ ఆస్థానా మధ్య తలెత్తిన విబేధాల నేపథ్యంలో సీబీఐలో అనూహ్యపరిణామాలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కాగా ఈ తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ ఈ విషయంలో కోర్టు తీర్పును అమలు చేస్తామన్నారు. సీబీఐ సమగ్రతను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించినట్లుగా కోర్టు తీర్పు ఉందన్నారు. కేంద్రం న్యాయపరిధికి లోబడి నిర్ణయం తీసుకుందన్నారు. ప్రతిపక్షనేత మల్లికార్జునఖార్గే మాట్లాడుతూ కోర్టు తీర్పు కేంద్రానికి చెంపపెట్టు అన్నారు. రాఫెల్ స్కాంలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తారనే భయంతో కేంద్రం అలోక్‌వర్మను బదిలీ చేసిందన్నారు.
మోదీని ఎవరూ రక్షించ లేరు: రాహుల్
న్యూఢిల్లీ: రాఫెల్ కుంభకోణం నుంచి ప్రధాని నరేంద్రమోదీని ఎవరూ కాపాడలేరని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు.
సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మను పునర్ నియమించమని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణంపై అలోక్‌వర్మ దర్యాప్తు చేపట్టనున్న నేపథ్యంలో అర్థరాత్రి ఆయనను తొలగించారని గుర్తు చేసిన రాహుల్ సుప్రీం కోర్టు తీర్పు ఆయనకు కొంతమేర న్యాయం చేసిందని అన్నారు.