క్రైమ్/లీగల్

క్యూనెట్ గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 8: ఒక్క రూపాయి సొంత డబ్బు లేకుండా కోట్లు సంపాదించవచ్చు.. నీ దగ్గర డబ్బులేక పోతే బ్యాంకులో అప్పు తీసుకుని మా సంస్థలో పెట్టుబడి పెట్టు .. బ్యాంకు రుణం మేమే ఇప్పిస్తాం.. సంవత్సరంలో కోట్లు సంపాదించవచ్చు అంటూ నిరుద్యోగ యువతకు ఆశలురేపి మోసం చేస్తున్న క్యూ నెట్ గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టుచేశారు. ఇరవై ఏళ్లుగా లక్షలాది మందిని మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్న సంస్థకు పోలీసులు కళ్లెం వేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ వివరించారు. విజయ్ ఈశ్వర్, జోసెఫ్ బిస్మార్క్‌లు 1998లో హాంగ్‌కాంగ్‌లో క్యూ ఐ గ్రూప్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం 2001లో గోల్డ్ క్వెస్ట్‌ను, 2004లో ఐ క్వయిన్ పేరుతో సంస్థలను ఏర్పాటుచేసి మోసాలకు పాల్పడినట్లు చెప్పారు. హాంకాంగ్, మలేషియాలో క్యూ నెట్‌కు అనుమతులున్నప్పటికీ మన దేశంలో ఎలాంటి అనుమతులు లేవన్నారు. 2004లో క్వెస్ట్ కాయిన్ పేరుతో బిజినెస్ మొదలు పెట్టి అరుదైన కాయిన్ ఉంటే అదృష్టం మీ వెంటే అంటూ అమాయకుల్ని బురిడీ కొట్టించడంతోపాటు అనేక రకాల పేర్లతో జనాల్ని మోసగిస్తూనే ఉందని తెలిపారు. 2011లో క్యూనెట్ మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో గొలుసుకట్టు వ్యాపారం మొదలైందని ఎలాంటి అనుమతులు లేని ఉత్పత్తులు, వస్తువులను అంటగడుతూ అమాయకుల్ని మోసం చేస్తున్నారని తెలిపారు. సదరు సంస్థలపై దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయని సీపీ చెప్పారు. కేసు నమోదు అయిన వెంటనే మరో పేరుతో మోసాలు చేస్తున్నట్లు సీపీ వివరించారు. బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక నిరుద్యోగ యువకులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడున్నారు. ఒక్కొక్కరి దగ్గర లక్ష నుండి ఐదు లక్షల వరకు వసూళ్లు చేశారని చెప్పారు. ఖరీదైన హోటల్స్‌లో నిరుద్యోగ యువకులతో సమావేశాలు ఏర్పాటు చేయడం బిజినెస్ గురించి వివరించే వ్యక్తి సూటు బూటుతో వచ్చి తాను కూడా గత రెండేళ్ల క్రితం ఒక్కపైసా లేకుండా వీధుల్లో తిరిగానని ఇప్పుడు కోట్లు సంపాదించానని చెప్తాడు. తమ సంస్థలో చేరితే విదేశాల్లో విహారయాత్రలు, స్టార్ హోటల్స్‌లో విందులు ఉంటాయని తక్కువ కాలంలో కోట్లు సంపాదించవచ్చని ప్రలోభాలకు గురి చేస్తారు. తను ఏ కంపెనీలో పనిచేస్తున్నది మాత్రం బాధితులకు చెప్పడు. బాధితుడు పెట్టుబడి పెట్టిన తరువాత ఎంతకీ ఎలాంటి డబ్బు రాకపోవడంతో ఎవరి ద్వారా డబ్బులు చెల్లించారో వారిని ప్రశ్నిస్తే మరో ఇద్దర్ని చేర్పించాలని సమాధానం వస్తుందని చెప్పారు. ఐటీ ఉద్యోగులతో పాటు ఉన్నత విద్యావంతులైన యువకులు వీరి బారిన పడి మోసపోతున్నారని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, మహారాష్టల్రో క్యూనెట్ బాధితులు లక్షలాది మంది ఉన్నారని అన్నారు. సైబరాబాద్‌లో 14 కేసుల్లో 58 మందిని క్యూనెట్ ఏజెంట్లను అరెస్టు చేశామని చెప్పారు. బెంగుళూరులో ఉన్న క్యూనెట్‌కు సంబంధించిన గోడౌన్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఏజెంట్లకు సంబంధించిన బ్యాంకు అకౌంట్లను విహాన్ డైరెక్ట్ సెట్లింగ్ ప్రయివేటు లిమిటెడ్ పేరుమీద ఉన్న ఖాతాలో రెండు కోట్ల 7లక్షల రూపాయలను ఫ్రీజ్ చేసినట్లు సీపీ పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేసిన నిందితులను అరెస్టు చేసిన ఎకనామిక్ ఆఫెనె్సస్ వింగ్, ఎస్‌ఓటీ పోలీసులను అభినందించారు. డీసీపీ విజయకుమార్, వెంకటేశ్వరరావు, ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.