క్రైమ్/లీగల్

రిజర్వేషన్ల తగ్గింపుపై సుప్రీంను ఆశ్రయించిన బీసీ సంఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గింపుపై బీసీ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. రిజర్వేషన్లు ఆర్డినెన్స్‌పై స్టే విధించలేమని హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్.కృష్ణయ్య, సామల రవీందర్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేయడంతో పాటు, బీసీ రిజర్వేషన్లు 34 నుంచి 22 శాతం తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని ఆర్.కృష్ణయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.