క్రైమ్/లీగల్

టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ కేసులో మారన్ సోదరులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మార్చి 14: కేంద్ర టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌కు టెలిఫోన్ ఎక్స్ఛేంజీ కేసునుంచి విముక్తి లభించింది. సోదరులిద్దరిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని నిర్ధారణకు వచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు వారిని విడుదల చేసింది. తమను టెలిఫోన్ ఎక్స్చేంజీ కేసు నుంచి తప్పించాలంటూ మారన్ సోదరులు కోర్టును అభ్యర్థించారు. పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ నటరాజన్ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్‌లకు విముక్తి కల్పించారు. ఈ నెల 9న పిటిషన్‌పై వాదనలు విన్న ప్రత్యేక న్యాయమూర్తి తన తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. దయానిధి మారన్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 2004-06లో చెన్నై నగరంలోని నివాసంలో ఓ ప్రేవేటు టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటుచేసినట్టు సీబీఐ ఆరోపించింది. అక్కడి నుంచే సన్ నెట్‌వర్క్‌కు సంబంధించి వ్యాపార లావాదేవీలు నడిచేవని కేసునమోదైంది. సన్ నెట్‌వర్క్ దయానిధి మారన్ సోదరుడు కళానిధి మారన్‌ది. ఈ ప్రేవేటు టెలిఫోన్ ఎక్సేంచ్ వల్ల ప్రభుత్వానికి 1.78 కోట్ల నష్టం వాటిల్లిందన్నది జాతీయ దర్యాప్తు సంస్థ అభియోగం. బుధవారం సీబీఐ ప్రత్యేక కోర్టు మారన్ సోదరులతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ జనరల్ మేనేజర్ కే బ్రహ్మానాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలుసామి, దయానిధి మారన్ ప్రైవేటు సెక్రెటరీ గౌతమన్, సన్ టీవీ అధికారులకు విముక్తి కల్పించింది. తాము ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, కేసుతో తమకు సంబంధం లేదని మారన్ సోదరులతోపాటు మాజీ అధికారులు కోర్టుకు తెలిపారు. మారన్ సోదరుల తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించారు.