క్రైమ్/లీగల్

చెట్టును ఢీకొట్టిన పోలీసు వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, జనవరి 9: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా జన్మభూమి కార్యక్రమానికి హైవే పెట్రోలింగ్ వాహనంలో వెళుతుండగా స్కూటర్‌ను తప్పించబోయి వీరి వాహనం అదుపుతప్పి చింతచెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. పులిచెర్ల మండలం ఆర్‌కె పేట గ్రామంలో జరిగే జన్మభూమి-మావూరు కార్యక్రమానికి బందోబస్తుకు వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, పూతలపట్టు ఎస్సై మల్లేష్ యాదవ్, హెచ్‌సి మునిరత్నం, పిసిలు ధనశేఖర్ నాయడు, కృష్ణమూర్తి, అశోక్‌కుమారు స్టేషన్‌కు చెందిన హైవే పెట్రోలింగ్ వాహనంలో బయలుదేరారు. ఈ వాహనాన్ని కానిస్టేబుల్ ఆశోక్‌కుమార్ (32) నడుపుతుండగా మార్గమధ్యమైన తలపులపల్లి మలుపు వద్ద హఠాత్తుగా రోడ్డు పైకి ద్విచక్ర వాహనం రావడంతో దానిని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పిన పెట్రోలింగ్ వాహనం రోడ్డు పక్కనున్న చింతచెట్టును ఢీకొంది. దీంతో వాహనాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ అశోక్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్సై మల్లేష్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ మునిరత్నం, కానిస్టేబుళ్లు ధనశేఖర్‌నాయుడు, కృష్ణమూర్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వారికి చిత్తూరు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సిఎంసికి తరలించారు. మృతుడు అశోక్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.