క్రైమ్/లీగల్

రైలులో బంగారం స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), జనవరి 9: రైలులో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని డీఆర్‌ఐ అధికారులు పట్టుకుని, రూ.కోటి ఏనిమిదిన్నర లక్షల రూపాయల విలువ చేసే 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు విడుదల చేశారు. గోహౌతి-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఈనెల 4న ఇద్దరు ప్రయాణికులు ప్రత్యేకంగా తయారు చేసిన బనియన్లలో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో విశాఖ రైల్వేస్టేషన్‌కు ఆ ఎక్స్‌ప్రెస్ చేరగానే, డీఆర్‌ఐ అధికారులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, తనిఖీ చేయగా వారు ధరించిన బనియన్లలో బంగారం ఉన్నట్టు గుర్తించారు. బంగారాన్ని మయన్మార్ నుండి ఇక్కడకు దిగుమతి చేసుకుని సికింద్రాబాద్‌కు రవాణా చేస్తున్నట్టు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించి ఎటువంటి కాగితాలు లేకపోవడంతో వారిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు వారు పేర్కొన్నారు. వీరితో పాటు స్మగ్లింగ్‌కు ప్రధాన సూత్రధారుడైన మరో వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్టు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉందని డీఆర్‌ఐ అధికారులు తెలిపారు.

చిత్రం..స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తు