క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడిబండ, ఫిబ్రవరి 9 : మండల పరిధిలోని మద్దనకుంట, గుడిబండ రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండల పరిధిలోని కేకే పాళ్యం గ్రామానికి చెందిన గోవిందప్ప (38) తన కుమార్తె కీర్తికకు అనారోగ్యంగా ఉండటంతో గుడిబండలో చికిత్సలు చేయించేందుకు ఆయన బంధువు మహలింగప్ప (35)తో కలసి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా వస్తున్న ఓ కారు ఢీకొంది. దీంతో గోవిందప్ప, మహలింగప్పలు తీవ్ర గాయాలకు గురికాగా కీర్తిక స్వల్ప గాయాలకు గురైంది. విషయాన్ని గమనించిన చుట్టు పక్కల వారు తీవ్ర గాయాలకు గురైన వారిని గుడిబండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్సల కోసం హిందూపురం ప్రభుత్వాసుపత్రికి వారిని తరలించారు. వారు చికిత్సలు పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోవిందప్పకు భార్య రత్నమ్మతోపాటు కుమార్తె కీర్తిక ఉండగా, మహలింగప్పకు భార్యతోపాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.