క్రైమ్/లీగల్

తప్పని చిక్కులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 11: కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం కుటుంబానికి కోర్టు చిక్కులు తప్పడం లేదు. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఫిబ్రవరి 1 వరకూ అరెస్టు చేయవద్దంటూ శుక్రవారం ఢిల్లీ కోర్టు ఆదేశించగా, శారదా చిట్స్ కుంభకోణం కేసులో ఆయన సతీమణి నళినీ చిదంబరంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసులో చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం నిందితునిగా ఉన్నారు. తండ్రీ, కుమారుడపై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసులను నమోదు చేశాయి. చిదంబరం, కార్తీ అరెస్టుకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది. వచ్చేనెల 1 వరకూ అరెస్టు చేయవద్దని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఓపీ సైనీ ఆదేశించారు. సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదనలు వినిపించారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, అభిషేక్ మను సింఘ్వీ మాజీ ఆర్థిక మంత్రి తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ కేసును ఆధారం చేసుకుని చిదంబరంపై దాఖలైన మనీలాండరింగ్ కేసును కోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 1 తరువాత అంటే 2నే మనీలాండరింగ్ కేసు విచారణకు చేపట్టాలని ఈడీ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితేష్ రాణా కోర్టును అభ్యర్థించారు. జూలై 19న చిదంబరం,కార్తీ చిదంబరంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. జూలై 31న అనుబంధ చార్జిషీట్ దాఖలైంది. 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉండగా విదేశీ నిధులకు సంబంధించి ఎఫ్‌ఐపీబీ బోర్డుకు అనుమతి ఇచ్చారని సీబీఐ అభియోగం. కాగా శారదా గ్రూప్ కంపెనీల నుంచి 1.4 కోట్ల రూపాయలు స్వీకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం సతీమణి నళినీ చిదంబరంపై సీబీఐ శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేసింది. శారదా చిట్స్ యజమాని సుదీప్తసేన్‌తో కలిసి నేరానికి పాల్పడినట్టు ఆరోపణ. చిట్స్ కుంభకోణంలో నళినీ పాత్ర ఉందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ ఆరోపించారు. సెబీ, ఆర్‌ఓసీని మేనేజ్ చేయడానికి నళినీకి సొమ్ములు ఇచ్చినట్టు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి మనోరంజన్ సిన్హా మాజీ భార్య మతాంగ్ సిన్హా రంగంలోకి దిగి నళినీని సుదీప్తసేన్‌కు పరిచయం చేసినట్టు దయాల్ చెప్పారు. 2010-12లో చిదంబరం సతీమణికి 1.4 కోట్ల రూపాయల ముట్టజెప్పారు. కోల్‌కతా ప్రత్యేక కోర్టులో ఆమెపై చార్టిషీట్ దాఖలైంది.