క్రైమ్/లీగల్

క్యూకట్టిన క్యూనెట్ బాధితులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 11: బిజినెస్ ప్లాన్ ఉందని అమాయక నిరుద్యోగులను లక్షల రూపాయలు మోసం చేసిన క్యూనెట్ బాధితులు సైబరాబాద్ కమిషనరేట్‌కు క్యూ కట్టారు. సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం.. క్యూనెట్ ఏజెంట్లుగా భావిస్తున్న 58 మందిని రెండు రోజుల క్రితం అరెస్టు చేయగా తాజాగా మరో ఇద్దరిని రిమాండ్‌కు పంపడంతో ఆ సంఖ్య 60కి చేరింది. 1998లో హాంకాంగ్‌లో క్యూ ఐగ్రూప్‌ని విజయ్ ఈశ్వర్ అనే వ్యక్తి ప్రారంభించారు. 2001లో గోల్డ్ క్వెస్ట్ పేరుతో, 2004లో ఐక్వయిన్ పేరుతో సంస్థలను ఏర్పాటు చేశాడు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థలపై వందల కేసులు ఉన్నాయి. పోలీసు కేసు చేసిన వెంటనే పేరు మార్చుకుని బయటకు రావడం వీరికి అలవాటూగా మారింది. క్యూనెట్ మోసాలను వెలికితీసిన సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకు రావడంతో దర్యాప్తు వేగం పెంచారు.

డ్రగ్స్ ముఠా అరెస్టు
గచ్చిబౌలి, జనవరి 11: మయన్మార్ నుంచి అక్రమంగా రావడంతో పాటు అక్కడి నుంచి తెచ్చిన నిషేదిత డ్రగ్‌సు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగత్ వివరించారు. మయన్మాన్ నుంచి అక్రమంగా వచ్చి బాలపూర్‌లోని వార్ ట్యాంక్ వద్ద నివాసముంటున్న అభిబుస్ రహిమాన్(21), మహ్మద్ రహిమ్(20) యాబా అనే నిషేదిత డ్రగ్స్‌ని తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలపూర్ ప్రాంతంలో విక్రమిస్తున్నట్లు సమాచారం అందుకొని నిందితులు అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద రూ.2లక్షల విలువైన 133 గ్రాముల ఏడు డ్రగ్స్ ప్యాకెట్లు లభించాయి. ఒక్కొక్క ప్యాకెట్లో 190 ట్యాబ్లెట్లు ఉన్నాయని వీటిని థాయిలాండ్, బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి 70 వేల రూపాయకు తెచ్చి అమ్ముతున్నారని ఈడ్రగ్స్‌ని అక్కడ యాబాగా పిలుస్తునట్లు సీపీ తెలిపారు.

అతివేగంతో ఆర్టీసీ బస్సు బోల్తా

వికారాబాద్, జనవరి 11: వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుకు పెద్ద ప్రమాదమే తప్పింది.
శుక్రవారం శంకర్‌పల్లి నుండి వికారాబాద్‌కు వస్తున్న బస్సు నవాబ్‌పేట మండలం నాగిరెడ్డిపల్లి వద్ద అదుపు తప్పి పల్టీ కొట్టడంతో బస్సులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో, మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఇద్దరిని వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరికొందరు పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే బస్సు సంఘటన మూడవది. విషయం తెలుసుకున్న జాయింట్ కలెక్టర్ అరుణ కుమారి, ఆర్డీవో విశ్వనాథం ఆసుపత్రికి చేరుకుని సంఘటన వివరాలు తెలుసుకున్నారు. వికారాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.