క్రైమ్/లీగల్

పంచాయతీ ఎన్నికల్లో హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యుర్థులు హల్‌చల్ చేస్తున్నారు. పరిమతంగా ఖర్చు చేయాలన్న ఎన్నికల నియమావళిని అభ్యర్థలు బేఖాతర్ చేస్తున్నారు. ప్రత్యర్థులపై పైచేయి చేయాలన్న లక్ష్యంతో నగదు, మద్యం పంపిణీకి అభ్యర్థులు వెనకంజ వేయడంలేదు. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో జోష్ కన్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ 12732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాలో అభ్యర్థుల ప్రచార శైలిపై అధికారులు శాడో పార్టీ పెట్టారు. ఎన్నికల అధికారులు ఇప్పటి వరకు కోటి 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న మద్యం విలువ దాదాపురూ 5లక్షల పైమాటే.
ఇక ఒకరిపై ఒకరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పోలీసులు 24 కేసులు నమోదు చేశారు. గడచిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పార్టీల కోసం పని చేసిన నేతలు ప్రస్తుతం ఎన్నికల్లో తలపడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలకు పంచాయతీ ఎన్నికలు తలనొప్పిగా మారాయి.