క్రైమ్/లీగల్

ఆమ్లెట్ కోసం ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, జనవరి 16: గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న తెలుగుదేశం పార్టీ బరిలో బుధవారం మధ్యాహ్నం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గుడ్‌మెన్‌పేట నుండి వచ్చిన ఒక వర్గం ఇష్టానుసారంగా మరో వర్గంపై దాడి చేయడంతో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన గ్యాంగ్ పరారీలో ఉంది. సంక్రాంతి పండుగకు ముందు పేకాట, కోడి పందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పోలీసులు 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు విచ్చలవిడిగా జూదం జరుగుతున్నా కనీసం కనె్నత్తి చూడలేదు. దీనికి తోడు మద్యం బెల్ట్‌షాపులను కూడా నడుపుతుండడంతో నాలుగు రోజులుగా తాగడం, ఆడడం తప్ప అసాంఘీక శక్తులకు పనేమీ లేకుండా పోయింది. టీడీపీ నాయకులు బైపాస్ రోడ్డులో, వైసీపీ నాయకులు లింగవరం రోడ్డులో బరిలను ఏర్పాటు చేసి పేకాట, కోడిపందాలు, గుండాట వంటి జూదాలను నిర్వహించారు. కాగా బైపాస్ రోడ్డులో ఉన్నట్టుండి ఆమ్లెట్ విషయం ఘర్షణకు దారి తీసింది. 5వ వార్డు శ్రీరాంపురానికి చెందిన చక్కా నరసింహరాజు ఆమ్లెట్ విషయంలో తోపుడు బండి నిర్వాహకుడితో గొడవ పడి కొట్టాడు. దీంతో నిర్వాహకుడు వెంటనే తన అనుచరులకు ఫోన్ చేసి రప్పించాడు. నరసింహరాజుతో పాటు వాంబే కాలనీకి చెందిన ధనాల ప్రశాంత్, ధనాల ఏసురాజు, మార్కెట్ సెంటర్‌కు చెందిన కొండపల్లి నగేష్‌లను తీవ్రంగా గాయపర్చారు. సమాచారం అందుకున్న రూరల్ సీఐ జీ శ్రీనివాస్, ఎస్‌ఐ లోవరాజు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని గాయపడ్డ వారి నుండి వాంగ్మూలం తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.