క్రైమ్/లీగల్

దుబాయలో మరో యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 17: ఎడారి దేశాలకేగి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే యువకుల తపన వారి నిండు ప్రాణాలను బలిగొంటోంది. ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలించకపోవడంతో, పుట్టెడు అప్పులు చేసి అక్కడికి వెళ్తున్న యువకులు తారుమారైన తమ అంచనాలతో మానసిక వ్యధ చెందుతూ, ఆర్థిక ఇబ్బందులను తల్చుకుని పరాయి దేశాల్లోనే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామం కాస్త బాధిత కుటుంబీకులను దుఃఖ సాగరంలో కూరుకుపోయేలా చేస్తోంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ తరహాలో ఇద్దరు యువకులు గల్ఫ్ దేశాల్లో తనువులు చాలించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన అనికేశ్ అరుణ్(28) వారం క్రితమే దుబాయ్ దేశానికి సంపాదన నిమిత్తం వెళ్లాడు. కంపెనీ వీసా కోసం ఏజెంట్‌కు భారీ మొత్తంలోనే డబ్బులు చెల్లించి దుబాయ్‌లోని అల్‌కుష్ ప్రాంతంలో గల ఓ కంపెనీలో కొలువులో చేరాడు. ఈ క్రమంలోనే అరుణ్ గురువారం ఉదయం తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. అరుణ్‌కు మూడు నెలల కిందటే పెళ్లి జరుగగా, ఇదివరకు కూడా ఆయన గల్ఫ్‌లో నాలుగేళ్లు పని చేసి వచ్చాడని కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.
తాజాగా పెళ్లి చేసుకుని వారం క్రితమే దుబాయ్‌కు వెళ్లిన అరుణ్, అంతలోనే ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఆర్థిక సమస్యలే కారణమై ఉంటాయని భావిస్తున్నారు. అక్కడి కంపెనీలో జీతం అతి తక్కువగా చెల్లిస్తామని పేర్కొనడంతో వీసా కోసం చేసిన అప్పులు ఎప్పటికి తీర్చాలనే ఆందోళనతో బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.
కారణం ఏదైనప్పటికీ నిండు ప్రాణం బలికావడంతో బాధిత కుటుంబం కన్నీటి పర్యంతం అవుతోంది. ఇదిలాఉండగా, ఈ నెల 10వ తేదీన ఇందల్వాయి మండలం కొత్తకోరుట్ల తండాకు చెందిన బదావత్ గణేష్ అనే యువకుడు కూడా బెహ్రయిన్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. వారం వ్యవధిలోనే ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లి తనువులు చాలించడం విషాదాన్ని మిగిల్చినట్లయ్యింది.