క్రైమ్/లీగల్

యూపీ అక్రమ మైనింగ్ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 18: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ మైనింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా కొరడా ఝళిపించింది. ఐఏఎస్ అధికారిణి బీ చంద్రలేఖ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ, ఇద్దరు అధికారులకు ఈడీ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. అలాగే మనీలాండరింగ్ కేసులు నమోదు చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సంచలనం రేపిన అక్రమ ఇసుక తవ్వకాల కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2012, 2016 సంవత్సరాల మధ్య హమీర్‌పూర్ ప్రాంతంలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్ చోటుచేసుకుంది. అలాగే ఈ కేసులో యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. అప్పట్లో గనులశాఖను అఖిలేష్ చూసేవారు. ఈనెల 24,28 తేదీల్లో స్వయంగా విచారణకు హాజరుకావాలని ఐఏఎస్ అధికారిణి చంద్రలేఖ, ఎమ్మెల్సీ రమేష్ కుమార్‌ను ఈడీ ఆదేశించింది. ఇద్దరూ లక్నోలోని ఈడీ విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని నోటీసులో స్పష్టం చేశారు. అలాగే మరో ఇద్దరు అధికారులకూ ఈడీ సమన్లు జారీ చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి, డబ్బు చేతులు మారినట్టు ఆరోపణలు వచ్చాయి. అధికారులు భారీగా చర, స్థిరాస్తులు కూడబెట్టినట్టు విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగానే నలుగురిపైనా మనీలాండరింగ్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అలాగే ఈనెల ఆరంభంలో 14 ప్రాంతాల్లో సీబీఐ విస్తృత సోదాలు జరిపింది. 11 మందిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. చంద్రకళ, మిశ్రా, సంజయ్ దీక్షిత్(ఇద్దరూ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ టిక్కెట్లపై పోటీ చేశారు)పై ఎఫ్‌ఐఆర్ నమోదయింది. హమీర్‌పూర్ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాల్లో వీరి పాత్ర ఉన్నట్టు దర్యాప్తు సంస్థ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అఖిలేష్ యాదవ్ 2012 నుంచి 2017 వరకూ ముఖ్యమంత్రిగా ఉండగా రెండేళ్లు గనులశాఖను పర్యవేక్షించారు. కాబట్టి ఆయన పాత్రపైనా సీబీఐ దృష్టి సారించింది. 2013లో గాయత్రి ప్రజాపతి గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన కూడా ఓ మహిళపై అత్యాచారం చేసిన 2017లో అరెస్టయ్యారు. చిత్రకూట్‌లోని తన ఇంట్లోనే ప్రజాపతి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.