క్రైమ్/లీగల్

ఆ బెంచ్ నుంచి తప్పుకున్న సీజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, జనవరి 21: సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరరావునియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. ఈనెల 10న నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. కాగా సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీ ఈనెల 24న సమావేశం కానుంది. ఈకమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సభ్యుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక డైరెక్టర్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారించే బెంచ్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన హైపవర్ కమిటీలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే సభ్యులుగా ఉన్నారు. ఈనెల 24 కమిటీ సమావేశమై సీబీఐ కొత్త డైరెక్టర్‌ను ఎంపిక చేయనుంది. అలోక్‌వర్మను డైరెక్టర్ పదవి నుంచి ప్రభుత్వ తప్పించడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకూ నాగేశ్వరరావే పూర్తి అధికారాలు కలిగి ఉంటారు.‘సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో నేను సభ్యుడ్ని. సమావేశంలో పాల్గొంటాను. అందువల్ల తాత్కాలిక డైరెక్టర్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణకు హాజరుకావడం లేదు. బెంచ్ నుంచి వైదొలుగుతున్నా’అని గొగోయ్ వెల్లడించారు. ఆ బెంచ్‌లో న్యాయమూర్తి సంజయ్‌ఖన్నా ఉన్నారు. నాగేశ్వరరావునియామకాన్ని ‘కామన్‌కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థతోపాటు పలువురు సుప్రీంకలో సవాల్ చేశారు. రావునియామకంలో పారదర్శకత లేదని పిటిషనర్ తరఫున్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆరోపిస్తున్నారు. కాగా సీబీఐ డైరెక్టర్ ఎంపిక పారదర్శంగా సాగాలని సీజే ఆకాంక్షించారు.